AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air india: ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద డీల్‌.. 500 జెట్‌లకు అర్డర్లు

ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద డీల్ చేయబోతోంది. దాదాపు 500 జెట్‌లకు ఆర్డర్లు ఇవ్వడానికి కంపెనీ సన్నాహాలు పూర్తి చేసింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లో 500 కొత్త విమానాల..

Air india: ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద డీల్‌.. 500 జెట్‌లకు అర్డర్లు
Air India
Subhash Goud
|

Updated on: Jan 28, 2023 | 12:31 PM

Share

ఎయిర్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద డీల్ చేయబోతోంది. దాదాపు 500 జెట్‌లకు ఆర్డర్లు ఇవ్వడానికి కంపెనీ సన్నాహాలు పూర్తి చేసింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లో 500 కొత్త విమానాల కోసం శుక్రవారం ఆర్డర్‌లు చేయనుంది. టాటా ఇలా చేస్తే చరిత్రలోనే అతిపెద్ద డీల్ అవుతుంది. 100 బిలియన్ డాలర్లతో ఎయిర్ ఇండియా ఈ డీల్ చేయనుంది. ఈ బిలియన్ల డాలర్ల విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానాల డీల్‌ టాటా ప్రకటించినందుకు ఎంపీ విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు.

మీడియా కథనాల ప్రకారం, ఈ క్రమంలో 400 నారో బాడీ విమానాలు ఉంటాయి. ఇందులో A320neos, A321neos, బోయింగ్ 737 MAXలు ఉంటాయి. ఇది కాకుండా, 100 వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం కూడా ఆర్డర్ చేయనుంది. ఇందులో బోయింగ్ 787లు, 777X, ఎయిర్‌బస్ A350లు, 777 ఫ్రైటర్‌లు ఉండవచ్చు. దీని కోసం ఎయిర్ ఇండియా 495 జెట్‌లలో సగం కొనుగోలు చేయడానికి బోయింగ్, ఇంజిన్ సరఫరాదారు జనరల్ ఎలక్ట్రిక్ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో శుక్రవారం బిలియన్ డాలర్ల ఆర్డర్‌ను ఖరారు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఏరో ఇండియా ఎయిర్ షోలో కూడా ఈ ప్రకటనపై చర్చ జరిగింది. ఇంతకుముందు ఈ డీల్‌పై బహిరంగ ప్రకటన వస్తుందని భావించినా.. ఇప్పుడు దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఏరో ఇండియా ఎయిర్ షో సందర్భంగా ఈ డీల్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. తయారీదారులు బోయింగ్, ఎయిర్‌బస్, అలాగే సీఎంఎఫ్‌ జాయింట్ వెంచర్ భాగస్వాములు జీఈ, సఫ్రాన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. దీనిపై ఎయిర్ ఇండియా కూడా స్పందించలేదు. ఎయిర్ ఇండియా దాదాపు 500 జెట్‌లను కొనుగోలు చేయబోతున్నట్లు గత నెలలో రాయిటర్స్ నివేదించింది.

ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, ఎయిర్ ఇండియా ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో చేరుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022లో భారతదేశంలో దేశీయ ప్రయాణికుల రద్దీ దాదాపు 47 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి