Children’s scooter: పిల్లల కోసం ప్రత్యేక బైక్ .. ఎంత క్యూటో.. అంతే స్మార్టూ.. మీరే ఓ లుక్కేయండి..
పిల్లలకు బైక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అటువంటి ఆందోళన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే భద్రతా పరమైన అన్ని చర్యలు తీసుకొని, స్కూల్ పిల్లలు సైతం సులభంగా వినియోగించేలా దీనిని తయారు చేసింది.
నూతన ఆవిష్కరణల్లో చైనా ముందుంటుంది. అధునాతన సాంకేతికత ఆధారంగా అనేక రకాల వస్తువులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇదే క్రమంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేసింది చైనాకు చెందిన ఎన్ఐయూ(NIU ) కంపెనీ. పిల్లలకు బైక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అటువంటి ఆందోళన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే భద్రతా పరమైన అన్ని చర్యలు తీసుకొని, స్కూల్ పిల్లలు సైతం సులభంగా వినియోగించేలా దీనిని తయారు చేసింది. అత్యంత ధృడంగా, అతి తక్కువ బరువుతో దీనిని రూపొందించింది. అన్ని వయసుల పిల్లలకు దీనిని వినియోగించుకోవచ్చు.
ఇద్దరు పిల్లలు ప్రయాణించవచ్చు..
చైనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు NIU కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మావెరిక్స్ NQi ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది పిల్లలకు కోసం ప్రత్యేకించిన మోడల్ . ఇది చాలా తేలికపాటి డిజైన్. ఇ-స్కూటర్ ఫ్రేమ్ అధిక బలం కలిగిన మెటల్ తో తయారు చేశారు. PP హార్డ్ షెల్‌తో అమర్చబడి ఉంటుంది. పిల్లలు సులభంగా దీనిని వినియోగించగలుతారు. కేవలం 11 కిలో బరువు ఉండే ఈ బైక్ 8 0 కేజీల బరువును మోయగలుగతుంది. అంటే ఇద్దరు పిల్లలు ఎంచక్కా తిరగొచ్చు.
పాటలు వింటూ..
మావెరిక్స్ NQi ఎలక్ట్రిక్ స్కూటర్ పిల్లలకు వినోదాన్ని అందించే అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది. ఇది యూఎస్బీ, ఎస్డీ కార్డ్ ఇంటర్ ఫేస్ లను కలిగి ఉంది. ఓ స్పీకర్ కూడా అందుబాటులో ఉంది. పిల్లలు ఎంచక్కా పాటలు వింటూ బైక్ పై ప్రయాణించవచ్చు. అలాగే యాంబియల్ లైటింగ్ తో వస్తోంది.
అద్భుత నియంత్రణ..
మావెరిక్స్ NQi ఈ బైక్ మరొక గొప్ప నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. ఫార్వర్డ్ మూమెంట్, పార్కింగ్, రివర్స్ అనే మూడు గేర్‌లతో వస్తుంది. దీనివల్ల పిల్లలు ఇ-స్కూటర్‌ను ఎలా నడపాలి అనేది సులభంగా అర్థమవుతుంది. పిల్లలు డ్రైవ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ , భద్రత కోసం రెండు వైపులా సహాయక చక్రాలు కూడా ఉంటాయి. ఇది ప్రమాదాలను నిరోధించడంతోపాటు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు స్థిరత్వాన్ని అందిస్తుంది.
స్పెక్స్ ఇవి..
మావెరిక్స్ NQi 12V, 4.5A లెడ్-యాసిడ్ బ్యాటరీ వస్తుంది. ఇది గరిష్టంగా 5km/h వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 90 నిమిషాలు లేదా 7.5km మైలేజీ వస్తుంది. చైనాలో పిల్లల ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 699 యువాన్ ($103), ప్రస్తుతం Jingdong (JD.com) అమ్మకాలు జరుగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..