AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Games App: ఖేలో ఇండియా ఆటగాళ్ల కోసం న్యూ యాప్… సమస్త సమాచారం అందులోనే..!

అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొనె అథ్లెట్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది, అథ్లెట్ల తల్లిదండ్రులు, అధికారులు సైతం ఒక్క బటన్ ను క్లిక్ చేయగానే ఆటల గురించి సమస్త సమాచారం తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.

New Games App: ఖేలో ఇండియా ఆటగాళ్ల కోసం న్యూ యాప్… సమస్త సమాచారం అందులోనే..!
Khelo
Nikhil
|

Updated on: Jan 31, 2023 | 9:17 AM

Share

ఖేలో ఇండియా యూత్ గ్రేమ్స్ కోసం ప్రత్యేక యాప్ ను యువజన వ్యవహారాాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొనె అథ్లెట్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది, అథ్లెట్ల తల్లిదండ్రులు, అధికారులు సైతం ఒక్క బటన్ ను క్లిక్ చేయగానే ఆటల గురించి సమస్త సమాచారం తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. గేమ్ ల కోసం ప్రత్యేక యాప్ ను రిలీజ్ చేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. యాప్ కు ప్రత్యేకంగా అథ్లెట్ లాగిన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొత్తం కోర్సు వరకూ ఇది ఆటగాళ్లకు సమాచారం తెలుపుతుంది. అలాగే ప్రారంభానికిి ముందే వారి ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేశారో? లేదో? కూడా తనిఖీ చేయడానికి వారికి సాయం చేస్తుంది. ఖేలో ఇండియా యాప్ పనితీరుపై అధికారులు చాలా నమ్మకంతో ఉన్నారు. 

ఈ యాప్ రిజిస్ట్రేషన్ సమయంలోనే క్రీడాకారులకు మరింత పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్ కు సంబంధించిన క్రీడాకారులు వారి ఆటల కోసం రిజిస్టర్ చేసుకుని వారు అక్కడకు చేరుకున్నప్పుడు అథ్లెట్లు తమ స్పోర్ట్స్ కిట్స్ జారీ పరిస్థితి, హోటల్, రవాణా ప్రణాళిక వంటి విషయాలను ముందుగానే యాక్సెస్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో అథ్లెట్లు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే క్రీడాకారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం తెలిపేలా యాప్ ను రూపొందించారు. దీని వాట్సాప్ చాట్ బాట్ ను కూడా రూపొందించారు. అలాగే ఈ యాప్ లో క్రీడాభిమానుల కోసం మ్యాచ్ షెడ్యూల్స్, పతకాల సంఖ్య, వేదికల చిరునామా, ఫొటో గ్యాలరీని కూడా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ నుంచి ఉచితం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యాప్ వెంటనే ఇన్ స్టాల్ చేసుకుని సంబంధిత సమాచారాన్ని తెలుసుకోండి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..