79 ఫోర్లు, 13 సిక్సర్లతో 701 పరుగులు.. రోహిత్, కోహ్లీల శివతాండవం.. కట్ చేస్తే.. 5గురి బౌలర్ల ఊచకోత!
ఒకప్పుడు బ్యాటింగ్ లో టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం. టాప్ ఆర్డర్ లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారంటే.. కచ్చితంగా జట్టు మ్యాచ్ గెలిచినట్లే.
ఒకప్పుడు బ్యాటింగ్ లో టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం. టాప్ ఆర్డర్ లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారంటే.. కచ్చితంగా జట్టు మ్యాచ్ గెలిచినట్లే. మరి వారెవరో కాదు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. 2013-14 మధ్య ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన 7 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ముగ్గురు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై శివతాండవం ఆడారు. ఆ సిరీస్‌లోని 6వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేయగా.. ఆ లక్ష్యఛేదనను టీమిండియా 3 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ధాటికి ఓపెనర్లు ఇద్దరూ 45 పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక అప్పుడు బరిలోకి దిగిన షేన్ వాట్సాన్(102), జార్జ్ బెయిలీ(156) అద్భుత ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిపి మూడో వికెట్‌కు 168 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న ఆసీస్ కెప్టెన్ బెయిలీ.. 114 బంతులు ఎదుర్కుని 13 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 156 పరుగులు చేశాడు. అలాగే ఆడమ్ వోగ్స్ 38 బంతుల్లో 44 పరుగులు చేయడంతో.. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లకు 350 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
351 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(79), ధావన్(100) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 178 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ(115) అద్భుతమైన శతకంతో అదరగొట్టాడు. 66 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో ధోని(25) క్యామియో ఇన్నింగ్స్ ఆడటంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు.. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. సీనియర్ బౌలర్లైన జాన్సన్, ఫాల్క్‌నర్, మెకెయ్ లాంటి వాళ్లు ఓవర్‌కు 7 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. ఇక అదిరిపోయే సెంచరీతో అలరించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..