IND Vs NZ: కివీస్‌తో ఫైనల్ టీ20.. ఆ విధ్వంసకర ఓపెనర్‌కు నో ఛాన్స్.! అదే జరిగితే మనదే సిరీస్..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jan 31, 2023 | 6:58 PM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ ఫైనల్ మ్యాచ్‌పై..

IND Vs NZ: కివీస్‌తో ఫైనల్ టీ20.. ఆ విధ్వంసకర ఓపెనర్‌కు నో ఛాన్స్.! అదే జరిగితే మనదే సిరీస్..
Ind Vs Nz

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ ఫైనల్ మ్యాచ్‌పై కన్నేశాయి. ఇప్పటికే ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇక వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్‌పై కూడా కన్నేసిన భారత్.. లాస్ట్ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని నిర్ణయించుకుంది.

గత మ్యాచ్‌లో, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసిన హార్దిక్ పాండ్యా టీం. మూడో టీ20లోనూ చాహల్ కొనసాగే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి మార్పు లేకుండానే లాస్ట్ టీ20లో టీమిండియా బరిలోకి దిగనుంది. కాగా, రెండో టీ20లో చాహల్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోసారి మన స్పిన్ బౌలర్లు విజృంభిస్తే.. సిరీస్ మనదే అని చెప్పాలి.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu