IND Vs AUS: భారత్‌లో ఆసీస్ పర్యటన.. 19 ఏళ్ల తర్వాత విజయం కోసం మాస్టర్ ప్లాన్.. అక్కడ నుంచి స్కెచ్!
భారత జట్టు బుధవారం న్యూజిలాండ్‌తో చివరి టీ20 ఆడనుంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది..
భారత జట్టు బుధవారం న్యూజిలాండ్‌తో చివరి టీ20 ఆడనుంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది. బెంగళూరులో క్రికెట్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక్కడే ఆసీస్ జట్టు టీమిండియాపై విజయం సాధించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.
ఇక ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. 19 సంవత్సరాలుగా భారత్‌లో.. ఆస్ట్రేలియా ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా ఇప్పుడు తహతహలాడుతోంది. టీమిండియాను ఎలా ఓడించాలనే మాస్టర్‌ప్లాన్ బెంగళూరులోనే సిద్ధం చేయాలని ప్రణాళికలు చేస్తోంది.
కాగా, బెంగళూరులో శిక్షణా శిబిరాలకు మంచి పిచ్‌లు అందిస్తామని ఇప్పటికే బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాకు హామీ ఇచ్చింది. అలాగే భారత్‌కు బయలుదేరే ముందు, సిడ్నీలో భారత్ లాంటి పిచ్‌లు తయారు చేసి ప్రాక్టీస్ చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తమ ప్రణాళిక గురించి మాట్లాడారు. స్పిన్ పిచ్‌లపై తమ జట్టు అద్భుతమైన ప్రాక్టీస్ కొనసాగిస్తుందని.. పాకిస్తాన్‌లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేశామన్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..