జాతీయ రికార్డుతో అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్ అన్ మారియా.. పతకాలలో జైన్ యూనివర్శిటీ టాప్..
Khelo India University Games: వెయిట్ లిఫ్టర్ ఆన్ మారియా(Ann Maria) బుధవారం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్(Khelo University Games)లో 87+ కేజీల వెయిట్ విభాగం క్లీన్ అండ్ జెర్క్‌లో జాతీయ రికార్డుతో బంగారు పతకాన్ని..
వెయిట్ లిఫ్టర్ ఆన్ మారియా(Ann Maria) బుధవారం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్(Khelo University Games)లో 87+ కేజీల వెయిట్ విభాగం క్లీన్ అండ్ జెర్క్‌లో జాతీయ రికార్డుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మంగళూరు యూనివర్సిటీ క్రీడాకారిణి 129 కేజీలు ఎత్తి ఈ ఏడాది ప్రారంభంలో మన్‌ప్రీత్ కౌర్ నెలకొల్పిన 128 కేజీల వెయిట్ కేటగిరీ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మన్‌ప్రీత్ ఈ రికార్డును నమోదు చేయడం విశేషం. స్నాచ్‌లో 101 కేజీలు ఎత్తి మొత్తం 230 కేజీలతో బంగారు పతకం సాధించింది. అన్ మరియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో శిక్షణ పొందుతుంది. అయితే పతకాల పట్టికలో జైన్ యూనివర్శిటీ(Jain University) అగ్రస్థానంతో దూసుకపోతోంది.
అయితే అన్ మరియా.. తన సొంత జాతీయ రికార్డును సమం చేసే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లను కలిపి ఆన్ మరియా 231 కిలోలతో జాతీయ రికార్డు సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. అయితే క్లీన్ అండ్ జెర్క్‌లో తన బెస్ట్‌ను అందించడం సంతోషంగా ఉంది.
జైన్ యూనివర్సిటీ ఆధిక్యం కొనసాగుతోంది..
బుధవారం నాడు మొత్తం 17 బంగారు పతకాలు రాగా.. పతకాల పట్టికలో జైన్ యూనివర్సిటీ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. 10 బంగారు పతకాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలు జైన్ యూనివర్సిటీ ఖాతాలో చేరాయి. ఈ రోజు ఐదు మీట్ రికార్డులు నమోదయ్యాయి. అన్నా యూనివర్సిటీ తొలి మీట్ రికార్డును నెలకొల్పింది. పురుషుల 4×100 మీటర్ల మెడ్లేలో ఈ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీ హరి నటరాజ్, శివ శ్రీధర్ వంటి ఆటగాళ్లతో అలరించిన జైన్ యూనివర్శిటీ చివరి దశ వరకు ముందుండగా, అన్నా యూనివర్సిటీకి చెందిన ఆదిత్య దినేష్ అద్భుతమైన స్విమ్మింగ్ టెక్నిక్స్‌తో ఆకట్టుకోవడంతో జైన్ యూనివర్శిటీని వెనక్కు నెట్టాడు.
పంజాబ్ యూనివర్సిటీ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 15 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. సావిత్రి బాయి ఫూలే విశ్వవిద్యాలయం ఐదు బంగారు పతకాలు, ఆరు రజత పతకాలు, ఏడు కాంస్య పతకాలతో మూడవ స్థానంలో ఉంది.
బ్యాడ్మింటన్‌లో జైన్ యూనివర్సిటీకి ఎదురేలేదు..
జైన్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్‌లో తొలి పతకాన్ని సాధించింది. పురుషుల, మహిళల విభాగాల్లోనూ తన ప్రతాపాన్ని చాటింది. షూటింగ్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రెండు పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సావిత్రి బాయి ఫూలే పూణే యూనివర్సిటీ బంగారు పతకం సాధించింది. ఈ యూనివర్సిటీకి చెందిన రసిక కుల్వే, గజానన్ ఖండాగ్లే జోడీ విజయాన్ని అందించారు. ఈ జోడీ మణిపాల్ యూనివర్సిటీకి చెందిన మణిని కౌశిక్, యశ్ వర్ధన్‌లను ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో కూడా గజానన్ కాంస్యం సాధించాడు. మహిళల బాస్కెట్‌బాల్‌లో మద్రాస్ యూనివర్శిటీ 65-48తో ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీని ఓడించి, బంగారు పతకం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
GT vs SRH Live Score: మరోసారి అదరగొట్టిన హైదరాబాద్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..