Khelo India University Games: స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డులు.. 3 బంగారు పతకాలతో సత్తా చాటిన శ్రీహరి నటరాజ్..

గురువారం జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ (Khelo India University Games)లో భారత ఒలింపియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్(Srihari Natraj) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, మూడు బంగారు పతకాలు సాధించాడు.

Khelo India University Games: స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డులు.. 3 బంగారు పతకాలతో సత్తా చాటిన శ్రీహరి నటరాజ్..
Khelo India University Games
Follow us

|

Updated on: Apr 29, 2022 | 6:05 AM

గురువారం జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ (Khelo India University Games)లో భారత ఒలింపియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్(Srihari Natraj) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, మూడు బంగారు పతకాలు సాధించాడు. జైన్ యూనివర్శిటీ(Jain University)కి ప్రాతినిధ్యం వహిస్తున్న నటరాజ్ 100 మీటర్ల ఫ్రీస్టైల్, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4×200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో పలు రికార్డులు సృష్టించాడు. దీంతో పతకాల పట్టికలో జైన్ యూనివర్సిటీ తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 16 బంగారు పతకాలతో పాటు ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి 24 పతకాలు సాధించింది. తొమ్మిది బంగారు పతకాలతో పంజాబ్ యూనివర్సిటీ రెండో స్థానంలో, ఆరు బంగారు పతకాలతో ముంబై యూనివర్సిటీ మూడో స్థానంలో ఉన్నాయి.

నటరాజ్ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో 50.98 సెకన్లు పూర్తి చేసి గతేడాది ఈ టోర్నీలో రుద్రాంశ్ మిశ్రా నెలకొల్పిన 53.01 సెకన్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఈవెంట్‌లో రజత పతకాన్ని ముంబై యూనివర్సిటీకి చెందిన హీర్ షా, అన్నా యూనివర్సిటీకి చెందిన ఆదిత్య దినేష్‌కు కాంస్య పతకం దక్కాయి. హీర్ 52.78 సెకన్లు, దినేష్ 52.79 సెకన్లలో రేసును పూర్తి చేశారు.

50మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో..

ఆ తర్వాత నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 26.10 సెకన్లతో మొదటి స్థానంలో నిలిచాడు. రజత పతకం సాధించిన జైన్ యూనివర్సిటీకి చెందిన శివ శ్రీధర్ 27.10 సెకన్లు, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన సిద్ధాంత్ సెజ్వాల్ 27.69 సెకన్లలో ఈరేస్‌ను పూర్తి చేశారు. నటరాజ్ 4×200 మీటర్ల రన్నింగ్‌లో సంజయ్ జయకృష్ణన్, శివ శ్రీధర్, రాజ్ రెలేకర్‌లతో కలిసి బంగారు పతకం సాధించారు. జైన్ యూనివర్శిటీకి చెందిన ఈ జట్టు 8:06.87 సెకన్లలో పూర్తి చేసింది. సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ నుంచి రజత పతకం వచ్చింది. ఈ జట్టు 8:22.17 సెకన్లు పట్టింది. ముంబయి జట్టు 8:28.57 సెకన్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

దనుష్ సురేష్‌కు స్వర్ణం..

100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అన్నా యూనివర్సిటీకి చెందిన దనుష్‌ సురేష్‌ బంగారు పతకం సాధించాడు. ఈ ఆటగాడు 1:03.36 సెకన్లలో రేస్‌ను పూర్తి చేశాడు. 1:06.33 సెకన్లలో రేసును పూర్తి చేసిన ముంబై యూనివర్సిటీకి చెందిన జే ఎక్బోటే రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అడమాస్ యూనివర్సిటీకి చెందిన కృత్యుష్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఆటగాడు 1:07.16 సెకన్లలో పూర్తి చేశాడు. జైన్ యూనివర్సిటీకి చెందిన శివ శ్రీధర్ స్విమ్మింగ్‌లో మొత్తం ఏడు బంగారు, రెండు రజత పతకాలు సాధించి స్టార్‌గా నిలిచాడు.

విలువిద్యలో..

విలువిద్యలో మొదటి రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయానికి చెందిన ముస్కాన్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ, ఆమె తన ప్రదర్శనను కొనసాగించలేకపోయింది. గురునానక్ దేవ్ యూనివర్శిటీకి చెందిన స్నేహ రాణి చేతిలో 135-139తో చివరి స్థానంలో జరిగిన క్వాలిఫయర్‌లో ఓడిపోయింది. తర్వాతి రౌండ్‌లో రాణి, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన సుజాత చేతిలో పరాజయం పాలైంది. గతేడాది రజత పతక విజేత రాగిణి మార్కో సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్‌లోనూ పలు మార్పులు కనిపించాయి. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన టాప్ సీడ్ కుల్విందర్ సింగ్ 141-143తో శివాజీ యూనివర్సిటీకి చెందిన కునాల్ షిండే చేతిలో ఓడిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: KKR Vs DC: రాణించిన కుల్దీప్‌ యాదవ్, డెవిడ్‌ వార్నర్‌.. కోల్‌కత్తాపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం..

KKR vs DC: రాణించిన నితిష్, శ్రేయస్‌.. 146 పరుగులు చేసిన కోల్‌కత్తా

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్