KKR Vs DC: రాణించిన కుల్దీప్‌ యాదవ్, డెవిడ్‌ వార్నర్‌.. కోల్‌కత్తాపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా మంబైలోని వాఖండే స్డేడియంలో కోల్‌కత్త నైట్‌రైడర్స్(KKR), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

KKR Vs DC: రాణించిన కుల్దీప్‌ యాదవ్, డెవిడ్‌ వార్నర్‌.. కోల్‌కత్తాపై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం..
Dc
Follow us

|

Updated on: Apr 29, 2022 | 12:00 AM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా మంబైలోని వాఖండే స్డేడియంలో కోల్‌కత్త నైట్‌రైడర్స్(KKR), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 146 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే అరోన్‌ ఫించ్‌.. చేతన్ సకారియ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఐదో ఓవర్‌లో అక్సర్‌ పటేల్‌ బౌలింగ్‌లో వెంకటేష్‌ అయ్యారు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఇంద్రజిత్, సునీల్ నరైన్‌ వెంటవెంటనే ఔటయ్యారు.

దీంతో నితిష్‌ రాణా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 37 బంతుల్లో 24(4 ఫోర్లు) పరుగులు చేసిన శ్రేయస్‌ కుల్దీప్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అండ్రూ రసెల్‌ స్టాంప్ ఔటయ్యాడు. నితిష్‌ రాణా, రింక్‌ సింగ్‌ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో నితిష్ రాణా హాఫ్‌ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 57(3 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రింక్ సింగ్‌ 23 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్ నాలుగు వికెట్ల్ పడగొట్టగా రెహమన్‌ మూడు, అక్సర్ పటేల్, సకరియా ఒక్కో వికెట్‌ తీశారు.

147 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదటి బంతికే వికెట్‌ కోల్పోయింది. ఉమేష్ యాదవ్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా కాటన్ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మిచెల్ మార్ష్‌ పెవిలియన్‌ చేరాడు. వార్నర్‌, లలిత్ యాదవ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 26 బంతుల్లో 43(8 ఫోర్లు) చేసిన వార్నర్ ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే నరైన్‌ బౌలింగ్‌లో 22 పరుగులు చేసిన లలిత్‌ యాదవ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. పంత్‌ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అక్సర్‌ పటేల్, పావెల్‌ బాగానే ఆడారు. అయితే 17 బంతుల్లో 24 పరుగులు చేసిన అక్సర్‌ పటేల్‌ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 113 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వతా పావెల్‌, షర్దూల్‌ ఠాగూర్‌ జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఢిల్లీ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

Read Also.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఆకాశానికి ఎత్తేసిన మాజీ కేంద్ర మంత్రులు.. ఎందుకో తెలుసా?

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!