AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Chrome: మీ డేటా భద్రంగానే ఉందా? సైబరాసురుల చేతికి చిక్కితే అంతే? ఈ టిప్స్ తో మీ ప్రైవసీని కాపాడుకోండి..

ఏదైనా ఆన్ లైన్ అనేలా సమాజం రూపాంతరం చెందుతోంది. సెర్చింగ్ నుంచి షాపింగ్ వరకూ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ దాడులు అధికమయ్యాయి. వినియోగదారుల భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాడే వెబ్ సైట్స్, సెర్చ్ ఇంజిన్ లలో భద్రతా పరమైన కొన్ని సెట్టింగ్ పై కొంత అవగాహన ఉండటం అవసరం.

Google Chrome: మీ డేటా భద్రంగానే ఉందా? సైబరాసురుల చేతికి చిక్కితే అంతే? ఈ టిప్స్ తో మీ ప్రైవసీని కాపాడుకోండి..
Google Chrome
Madhu
|

Updated on: Jan 29, 2023 | 2:16 PM

Share

ఇంటర్ నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్, ట్యాబ్, లేదా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ వంటివి వాడుతూనే ఉన్నారు. ఏదైనా ఆన్ లైన్ అనేలా సమాజం రూపాంతరం చెందుతోంది. సెర్చింగ్ నుంచి షాపింగ్ వరకూ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ దాడులు అధికమయ్యాయి. వినియోగదారుల భద్రత, ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాడే వెబ్ సైట్స్, సెర్చ్ ఇంజిన్ లలో భద్రతా పరమైన కొన్ని సెట్టింగ్ పై కొంత అవగాహన ఉండటం అవసరం. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే వెబ్ బ్రౌజర్ Google Chrome తన వినియోగదారుల ప్రైవసీ ని కాపాడటంతో పాటు వారి డేటాను భద్రంగా ఉంచేందుకు కొన్ని సెట్టింగ్స్ ను పొందుపరిచింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ తెలుసుకోవాలి..

గూగుల్ క్రోమ్ లో అందుబాటులో ఉన్న ప్రైవసీ, భద్రతా నియంత్రణలను అర్థం చేసుకోవడం, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా ప్రైవసీ సెట్టింగ్స్ ను కచ్చితంగా పెట్టుకోడానికి Chrome బ్రౌజర్ ఓపెన్ చేశాక.. సైట్ కుడి వైపు పై భాగంలో మూలన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ మెనూ ఓపెన్ అవుతుంది. దానిలో సెట్టింగ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత ప్రైవసీ, సెక్యూరిటీ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే.. కింద కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. వాటిలో ప్రైవసీ గైడ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

ప్రైవసీ గైడ్..

ఇక్కడ ప్రైవసీ గైడ్ మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అందులో మొదటిది మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతకా అనుకుంటున్న డేటాను బట్టి మనకు వచ్చే రిజల్ట్స్ లో క్వాలిటీ పెంచడం. దీనిని ఎనేబుల్ చేసి నెక్ట్స్ బటన్ పై క్లి క్ చేయాలి. ఆ తర్వాత రెండో విభాగం సేఫ్ బ్రౌజింగ్ ప్రోటెక్షన్.. దీనిలో రెండు ఎంపికలు కనిపిస్తాయి. అవి స్టాండర్ట్ ప్రోటెక్షన్, మరొకటి ఎన్ హ్యాన్స్ డ్ ప్రోటెక్షన్. వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని నెక్ట్స్ బటన్ నొక్కాలి. మూడోది థర్ట్ పార్టీ కూకి ప్రిఫరెన్సెస్. ఇది మీ సైట్ ల రక్షణను సూచిస్తుంది. అన్ని థర్డ్ పార్టీ సైట్లను మీరు బ్లాక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎప్పటికప్పుడు సేఫ్టీ చెక్స్..

క్రోమ్ లో ఎప్పటికప్పుడు సేఫ్టీ చెక్ ను అమలు చేయాలి. దీని వల్ల వినియోగదారులు సిస్టమ్ లోని హానికరమైన అంశాలను తెలుసుకునేందుకు సాయపడుతుంది. ఈ ఫీచర్ కోసం క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్ మెనూ ను క్లిక్ చేసి, రన్ చేయాలి. అప్పుడు అది చూపించిన అన్ని ఇష్యూలను పరిష్కరించాలి.

గూగుల్ పాస్ వర్డ్ మేనేజర్ ను వినియోగించుకోవాలి..

క్రోమ్ లో ఇన్ బిల్ట్ గా పాస్ వర్డ్ మేనేజర్ ఉంటుంది. ఇది వివిధ డివైజెస్ లో మీరు మీ గుగూల్ అకౌంట్ పై వినియోగించే పాస్ వర్డ్ లను సింక్రనైజ్ చేస్తుంది. అలాగే మెరుగైన భద్రత కోసం ఆ పాస్ వర్డ్ లను భద్రపరుస్తుంది. అలాగే స్టోర్ చేస్తుంది. అందుకే బ్రౌజర్ ఓపెన్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే సేవ్ పాస్ వర్డ్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది వద్దు అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు కూడా.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..