Flipkart sale: భలే మంచి చౌక బేరమూ… ఐఫోన్ పై భారీగా తగ్గింపు. ఎక్కడంటే..!
జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మార్కెట్ లోకి ఎన్ని బ్రాండ్ల ఫోన్లు వచ్చినా ఆపిల్ కంపెనీకి ఉన్న ఆదరణే వేరు. ఆపిల్ నుంచి విడుదలయ్యే ఐఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ ఫోన్ మార్కెట్ లోకి వచ్చిదంటే వినియోగదారులకు పండగే. కొత్త సినిమా టిక్కెట్ల కోసం క్యూలో ఉన్నట్టు సెల్ ఫోన్ షాపుల ముందు బారులు కడతారు.
జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మార్కెట్ లోకి ఎన్ని బ్రాండ్ల ఫోన్లు వచ్చినా ఆపిల్ కంపెనీకి ఉన్న ఆదరణే వేరు. ఆపిల్ నుంచి విడుదలయ్యే ఐఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ ఫోన్ మార్కెట్ లోకి వచ్చిదంటే వినియోగదారులకు పండగే. కొత్త సినిమా టిక్కెట్ల కోసం క్యూలో ఉన్నట్టు సెల్ ఫోన్ షాపుల ముందు బారులు కడతారు. మిగిలిన వాటితో పోల్చితే ఐఫోన్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిలో ప్రత్యేకతలు, టెక్నాలజీ ఉంటుంది. అయితే ఐఫోన్ భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి వస్తే అస్సలు వదులుకోకూడదు. ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ మిలియన్ డేస్ సేల్ లో ఈ అవకాశం ఉంది. దీనిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ పై రూ.33 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు.
అక్టోబర్ 6 వరకూ ఆఫర్
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ విజయవంతంగా నడుస్తోంది. అనేక రకాల వస్తువులపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ పై దాదాపు రూ.33 వేలు తగ్గింపులో అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి షరతులూ లేకుండా వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే అక్టోబర్ 6 వరకూ ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.
రూ.33 వేల తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఐఫోన్ 15 ప్రో 128 జీబీ స్టోరేజీ మోడల్ ను రూ.1,01,999కు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.1,34,999. అంటే 33 వేల తగ్గింపు ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఫోన్ మోడల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రో మోడల్ పై ఇంత డిస్కౌంట్ గతంలో ఎప్పడు ప్రకటించలేదు.
ఆలస్యం వద్దు
ఐఫోన్ ను ఇష్టపడేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారీ డిస్కౌంట్ పై ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ పూర్తయితే మళ్లీ ధర పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 6 వరకూ కొనసాగుతుంది. అప్పటి వరకూ ఐఫోన్ 15 ప్రో పై ఆఫర్ ఉంటుంది. అయితే గతంలో సేల్ ప్రారంభమైన ఒక రోజు తర్వాత ఫ్లిప్ కార్ట్ ధరలను పెంచేసేది. కానీ ఈసారి అలా జరగలేదు. గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి అలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ సేల్ ఇంకా కొనసాగుతున్నందున ధరలను పెంచాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధరను రూ.2 వేలు పెంచింది. దీన్ని రూ.1,21,999కి విక్రయిస్తుంది. దీని ముందు ధర రూ.1,19,999 మాత్రమే.
మరో 3 వేలు తగ్గింపు
ఐఫోన్ ప్రో 15ను కొనుగోలు చేసే వారికి మరికొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.3 వేలను అదనంగా తగ్గిస్తారు. దీనితో ఐఫోన్ ధర రూ.లక్షలోపు వచ్చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..