- Telugu News Photo Gallery Technology photos Lava launching new smart phone Lava Agni 3 5G features and price details
Lava Agni 3 5G: లావా నుంచి మరో సూపర్ ఫోన్.. బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న లావా తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. లావా అగ్నీ 3 5జీ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 02, 2024 | 8:08 AM

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లావా అగ్ని 3 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు పూర్తి వివరాలను ప్రకటించలేదు. అయితే నెట్టింట ఇందుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. వీటి ప్రకారం ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ప్రైమరీ సెన్సర్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు.

ఇక ఈ ఫోన్‌ను విరిడయన్ కలర్ ఆప్షన్‌లో తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర విషయానికొస్తే ఈ ఫోన్ ధర రూ. 21,999గా నిర్ణయించారు.




