Honor pad 9: లైట్ వెయిట్.. ఆకర్షణీయ డిజైన్.. అనువైన ధర.. హానర్ నుంచి కొత్త ట్యాబ్లెట్.. వివరాలు ఇవి..

అత్యుత్తమ ఫీచర్లతో రూపొందించిన హానర్ ప్యాడ్ 9 దేశ మార్కెట్ లోకి విడుదలైంది. తక్కువ ధర, సొగసైన స్టైల్ తో ఈ ట్యాబ్లెట్ ఆకట్టుకుంటోంది. మధ్యస్థ ధర ట్యాబ్లెట్ల విభాగంలో హానర్ 9 మిగిలిన వాటికి ధీటైన పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెజాన్ ఇండియాలో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Honor pad 9: లైట్ వెయిట్.. ఆకర్షణీయ డిజైన్.. అనువైన ధర.. హానర్ నుంచి కొత్త ట్యాబ్లెట్.. వివరాలు ఇవి..
Honor Pad 9
Follow us

|

Updated on: Apr 03, 2024 | 1:22 PM

అత్యుత్తమ ఫీచర్లతో రూపొందించిన హానర్ ప్యాడ్ 9 దేశ మార్కెట్ లోకి విడుదలైంది. తక్కువ ధర, సొగసైన స్టైల్ తో ఈ ట్యాబ్లెట్ ఆకట్టుకుంటోంది. మధ్యస్థ ధర ట్యాబ్లెట్ల విభాగంలో హానర్ 9 మిగిలిన వాటికి ధీటైన పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెజాన్ ఇండియాలో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

పెరిగిన వినియోగం..

మినీ ల్యాప్ టాప్ లుగా పిలుచుకునే ట్యాబ్లెట్ల వినియోగం ఇటీవల బాగా పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారి అవసరాలకు అనుగుణంగా అనేక ఫీచర్లతో కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. ల్యాప్ టాప్ లతో పోల్చితే వీటిని చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. వీటిలోని ఉత్తమ ఫీచర్ల కారణంగా డిమాండ్ కూడా భారీగానే ఉంది.

ఆకట్టుకునే స్టైల్..

హానర్ ప్యాడ్ 9 టాబ్లెట్ 8 జీబీ/ 256 జీబీ మెమరీ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంది. స్పేస్ గ్రే కలర్ లో ఆకట్టుకుంటోంది. మన దేశంలో రూ.24,999కు లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్ కింద వినియోగదారులు రూ. 2 వేల తగ్గింపు ధరతో రూ.22,999కు పొందవచ్చు. ట్యాబ్లెట్‌తో పాటు బ్లూటూత్ కీబోర్డ్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక ఫీచర్లు..

టాబ్లెట్ లోని ప్రత్యేక ఫీచర్ల కారణంగా పనితీరు అద్భుతంగా ఉంటుంది. 2560 x 1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 12.1 అంగుళాల డిస్‌ప్లే కారణంగా పిక్చర్ విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ సౌంట్ క్వాలిటీని మరింత మెరుగుపరిచింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని బరువు గురించే. కేవలం 555 గ్రాములతో అత్యంత తేలికగా ఉంటుంది. బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగే వీలుంటుంది. 6.96 మిల్లీమీటర్ల మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.

పనితీరు అద్భుతం..

ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 16 జీబీ (8+8) ర్యామ్‌తో హానర్ ప్యాడ్ 9 అత్యంత సమర్థంగా పని చేస్తుంది. గేమింగ్, మల్టీమీడియా అప్లికేషన్ల ను చక్కగా వినియోగించుకోవచ్చు. ఆండ్రెనో 710 జీపీయూ కారణంగా గ్రాఫిక్స్ పనితీరు మరింత మెరుగుపడుతుంది.

కెమెరా సూపర్..

కెమెరా విషయానికి వస్తే చాలా స్పష్టంగా చిత్రాలను తీసుకోవచ్చు. హానర్ ప్యాడ్ 9 ట్యాబ్లెట్ వెనుకవైపు 13 ఎంపీ కెమెరా అమర్చారు. ముందు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. దీనికి టీయూవీ రైన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్‌ కూడా వస్తుంది. ఈ ట్యాబ్లెట్ కు 128 జీబీ, 256 జీబీ ఫ్లాష్ మెమరీ ఉంది. దీనిని మెమరీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకూ విస్తరించవచ్చు. 8300ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా చార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది. అలాగే 35 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో వేగవంతంగా చార్జింగ్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్