AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best TV Brand: శామ్సంగ్ వర్సెస్ ఎల్‌జీ స్మార్ట్ టీవీ.. రెండింటిలో ఏది కొంటే బెటర్?

ఎవరైనా టీవీ కొనుగోలు చేయాలంటే మొదటి చూసే బ్రాండ్లు ఎల్‌జీ లేదా శామ్సంగ్. మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎవర్ గ్రీన్. ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? మీరు ఇప్పుడు స్మార్ట్ టీవీ కొనాలంటే ఏ బ్రాండ్ నకు వెళ్లాలి? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి..

Best TV Brand: శామ్సంగ్ వర్సెస్ ఎల్‌జీ స్మార్ట్ టీవీ.. రెండింటిలో ఏది కొంటే బెటర్?
Lg Vs Samsung
Madhu
|

Updated on: Apr 03, 2024 | 3:24 PM

Share

ఇప్పుడు మార్కెట్లో అంతా స్మార్ట్ ట్రెండ్ మాత్రమే నడుస్తోంది. గ్యాడ్జెట్ల దగ్గర నుంచి హోం అప్లయన్సెస్ వరకూ అంతా స్మార్టే. ముఖ్యంగా టీవీల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పోర్టబుల్ టీవీల స్థానంలో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు స్లిమ్ డిజైన్ తో వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 4కే, 8కే రిజల్యూషన్ తో ఇంట్లోనే థియేటర్ వీక్షణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా టీవీ కొనుగోలు చేయాలంటే మొదటి చూసే బ్రాండ్లు ఎల్‌జీ లేదా శామ్సంగ్. మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎవర్ గ్రీన్. ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? మీరు ఇప్పుడు స్మార్ట్ టీవీ కొనాలంటే ఏ బ్రాండ్ నకు వెళ్లాలి? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి..

రెండూ రెండే..

ఎల్‌జీ టీవీ లేదా శామ్సంగ్ టీవీలు రెండూ కూడా కస్టమర్లకు అనేక ఆప్షన్లను అందిస్తాయి. ఏ బ్రాండ్ కు అదే సాటి. ఒక్కో బ్రాండ్లో ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. శామ్సంగ్ కంపెనీ తన విస్తృత శ్రేణి క్యూఎల్ఈడీ(QLED) టెలివిజన్‌లకు ప్రసిద్ధి కాగా.. ఎల్‌జీ ఓఎల్ఈడీ(OLED) టెక్నాలజీతో అత్యంత ప్రజాదరణ పొందింది. రెండింటిలో ఒకే రకమైన ప్యానల్స్ ఉండవు. అయితే మీరు రెండింటిలో ఏది కొనుగోలు చేయాలనే ప్రశ్న వేస్తే.. అందుకు సమాధానంగా కొన్ని అంశాలను మీకు అందిస్తున్నాం. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది.

శామ్సంగ్ టీవీ..

మీకు ప్రకాశవంతమైన అంటే అధిక బ్రైట్ నెస్ తో కూడిన డిస్ ప్లే కావాలనుకుంటే శామ్సంగ్ మీకు బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ శామ్సంగ్ టీవీలో క్యూఎల్ఈడీ(క్వాంటం-డాట్ లైట్-ఎమిటింగ్ డయోడ్) సాంకేతికతతో స్క్రీన్ ఉంటుంది. ఇది అత్యుత్తమ చిత్ర నాణ్యతను అందిస్తుంది. 50 నుంచి 98 అంగుళాల మధ్య అత్యుత్తమ క్యూఎల్ఈడీ టీవీలు శామ్సంగ్ బ్రాండ్లో లభ్యమవుతున్నాయి. వాటిల్లో శామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ సిరీస్ టీవీలు ప్రస్తుతం మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో శామ్సంగ్ ఏఐ సాంకేతికతను అధికంగా వినియోగిస్తుంది. ఈ టీవీల్లో ఏఐ రియల్ డెప్త్ ఎన్‌హాన్సర్ ప్రో అనే సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. ఇది ఫ్రేమ్ ముందు భాగంలో చిత్రాలను షార్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ప్రధాన కంటెంట్ స్పష్టతను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎల్‌జీ టీవీ..

మీరు ఉత్తమ ఓఎల్ఈడీ టీవీల గురించి వెతుకుంటే మీకు ఎల్‌జీ టీవీ మంచి ఆప్షన్. సంవత్సరాలుగా ఎల్‌జీ డిస్ప్లే ప్రపంచంలోని ప్రముఖ ఓఎల్ఈడీ టీవీ ప్యానల్ తయారీదారుగా కొనసాగుతోంది. ఇది డార్క్ థీమ్ ని మరింత ఎఫెక్టివ్ గా చూపించడంల సాయపడుతుంది. రిచ్ కాంట్రాస్ట్, రిలయ్ బ్లాక్ ఓఎల్ఈడీ టెక్నాలజీకి ఈ టీవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇది ఇంట్లో థియేటర్, చీకటి గదుల్లో వీక్షణకు బాగా ఉపకరిస్తాయి. స్మార్ట్ ఎల్‌జీ టీవీలు కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన వెబ్ ఓఎస్లో రన్ అవుతాయి. ఇది హోమ్‌కిట్ వంటి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉండే సహజమైన ప్లాట్‌ఫారమ్ . ఎల్‌జీ టీవీలు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాతో కూడా అనుకూలంగా ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..