iPhone: ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే రూ.17 కోట్లు.. ఆపిల్ అద్భుత ఆఫర్..
మీరు ఆపిల్ సెక్యూరిటీని బద్దలు కొట్టి ఐఫోన్ లేదా మరేదైనా ఆపిల్ పరికరాన్ని హ్యాక్ చేయగలిగితే.. ఆ కంపెనీ మీకు కోట్ల రూపాయల బహుమతిని ఇవ్వగలదు. ఈ బహుమతిని కంపెనీ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ కింద ఇస్తారు. ఒక్కో విభాగానికి రివార్డ్ భిన్నంగా ఉంటుంది.

మీకు కోడింగ్‌లో నైపుణ్యం ఉందా? మీ ప్రతిభను నిరూపించుకొని భారీ నగదు బహుమతి గెలుచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు యాపిల్ ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ కింద, మీరు యాపిల్ భద్రతా వ్యవస్థను ఛేదించి, ఐఫోన్‌ను హ్యాక్ చేయగలిగితే, 17 కోట్లు వరకు గెలుచుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా, యాపిల్ తన ఐఫోన్ సిస్టమ్‌లోని భద్రతా లోపాలను కనుగొనడానికి కోడర్లను ఆహ్వానిస్తోంది.
ఎంత నగదు బహుమతి..?
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఈ ప్రోగ్రామ్ కింద బహుమతి మొత్తం 5000 డాలర్లు (సుమారు రూ.4.37 లక్షలు) నుండి రూ.2 మిలియన్ డాలర్స్(సుమారు రూ.17.49 కోట్లు) వరకు ఉంటుంది. మీరు కనుగొనే భద్రతా లోపం తీవ్రతను బట్టి ఈ మొత్తం మారుతుంది.
బహుమతి వివరాలు:
ఫిజికల్ యాక్సెస్: ఒకవేళ మీరు ఫిజికల్ యాక్సెస్‌తో ఫోన్‌ను హ్యాక్ చేస్తే రూ.2.18 కోట్ల వరకు గెలుచుకోవచ్చు.
ఇన్‌స్టాల్ చేసిన యాప్‌తో దాడి: ఒక యూజర్ ఇన్‌స్టాల్ చేసిన యాప్ ద్వారా ఫోన్ హ్యాక్ చేస్తే రూ.1.31 కోట్ల వరకు బహుమతి లభిస్తుంది.
నెట్‌వర్క్‌పై దాడి: నెట్‌వర్క్‌పై దాడి చేస్తే రూ.2.18 కోట్ల వరకు గెలుచుకోవచ్చు.
జీరో-క్లిక్ దాడి: యూజర్ ప్రమేయం లేకుండా జీరో-క్లిక్ దాడి చేసే హ్యాకర్‌కు సుమారు రూ.8.74 కోట్లు) బహుమతిగా ఇస్తుంది. అలాగే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్‌లో రిమోట్ దాడి చేసే హ్యాకర్‌కు కూడా ఇదే మొత్తాన్ని అందిస్తుంది.
గ్రాండ్ ప్రైజ్: రూ.17 కోట్లు
ఈ ప్రోగ్రామ్‌లో అత్యంత భారీ బహుమతి రూ.17.49 కోట్లు. ఐఫోన్ యొక్క అత్యంత కఠినమైన భద్రతా ఫీచర్ అయిన లాక్‌డౌన్ మోడ్‌ను ఛేదించగలిగిన హ్యాకర్‌కు ఈ గ్రాండ్ ప్రైజ్ లభిస్తుంది. డిజిటల్ బెదిరింపుల నుంచి వినియోగదారులకు అదనపు భద్రత కల్పించడానికి ఈ ఫీచర్‌ను రూపొందించారు.
ఈ బౌంటీ ప్రోగ్రామ్ యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్‌లు, వాచీలు, మ్యాక్‌లు మొదలైనవాటిని మాత్రమే కవర్ చేస్తుంది. అయితే కొన్ని రకాల దాడులు ఈ ప్రోగ్రామ్ పరిధిలోకి రావు. యాపిల్ పే, ఫిషింగ్ లేదా సోషల్ ఇంజనీరింగ్ దాడుల వల్ల కలిగే రిస్క్‌లను ఇందులో చేర్చలేదు. అలాగే థర్డ్-పార్టీ సేవల్లోని భద్రతా లోపాలు కూడా ఈ ప్రోగ్రామ్ కింద కవర్ చేయబడవు. కాబట్టి హ్యాకింగ్‌లో మీ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని, యాపిల్ సెక్యూరిటీని ఛేదించి కోటీశ్వరులు కావడానికి ఇదే మంచి అవకాశం.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




