AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel 10a స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ లీక్‌.. అభిమానులను నిరాశ పరుస్తుందా?

Google Pixel 10a: పిక్సెల్ 10aను ఇతర ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుండి వేరు చేయవచ్చు. పిక్సెల్ 9ఎను గూగుల్ గత ఏడాది మార్చిలో ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. అటువంటి పరిస్థితిలో పిక్సెల్ 10ఎ కూడా అదే టైమ్‌లైన్‌ను అనుసరిస్తుందని..

Google Pixel 10a స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ లీక్‌.. అభిమానులను నిరాశ పరుస్తుందా?
Subhash Goud
|

Updated on: Sep 05, 2025 | 1:57 PM

Share

Google Pixel 10a: గూగుల్ ఇటీవల తన పిక్సెల్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ కొత్త టెన్సర్ G5 చిప్‌సెట్‌పై నడుస్తాయి. కానీ ఇప్పుడు చర్చ పిక్సెల్ 9a వారసుడు ఫోన్ పిక్సెల్ 10a గురించి. దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అందుకున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఊహించిన విధంగా పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకురాలేదని తెలుస్తోంది. లీక్‌లు పిక్సెల్ 10a చాలా స్పెసిఫికేషన్లలో పిక్సెల్ 9a మాదిరిగానే ఉంటుందని సూచిస్తున్నాయి. పాత చిప్‌సెట్, పరిమిత అప్‌గ్రేడ్‌ల దృష్ట్యా, ఈ ఫోన్ చౌకైన కానీ శక్తివంతమైన పిక్సెల్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారిని నిరాశపరచవచ్చు.

ఇది కూడా చదవండి: Lemons Fresh Tips: ఇంట్లో నిమ్మకాయలు 2 రోజుల్లోనే ఎండిపోతున్నాయా? ఇలా చేస్తే 6 నెలల పాటు కూడా తాజాగా..

టిప్‌స్టర్ మిస్టిక్‌లీక్స్ ప్రకారం.. పిక్సెల్ 10a గత సంవత్సరం టెన్సర్ G5 చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుందట. పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ 9aలలో కూడా ఇదే చిప్‌సెట్ ఉపయోగించింది కంపెనీ. సరసమైన ధరకు ప్రీమియం పనితీరును పొందడానికి గూగుల్ సాధారణంగా దాని పిక్సెల్ a-సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఇస్తుంది. కానీ ఈసారి కంపెనీ దీని నుండి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ITR Filing 2025: మీరు ఈ తప్పు చేస్తే రీఫండ్‌ రావడానికి 9 నెలలు పట్టవచ్చు!

ఫీచర్లు ఎలా ఉంటాయి?

గూగుల్ పిక్సెల్ 10a మిగిలిన స్పెసిఫికేషన్లు ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కోసం UFS 3.1 టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది గతంలో పిక్సెల్ 9aలో కూడా కనిపించింది. డిస్‌ప్లేలో 2,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని ఇవ్వడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. తద్వారా స్క్రీన్ సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా విషయంలో కూడా గణనీయమైన మార్పు ఉండదు, అలాగే ఫోన్‌కు మునుపటిలా డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా? ఆందోళన రేపుతున్న బ్యాంకు రిపోర్ట్‌!

గూగుల్ కొత్త మ్యాజిక్ క్యూ టూల్ పిక్సెల్ 10aలో చేర్చలేదు. ఈ టూల్ పిక్సెల్ 10 సిరీస్‌లో ప్రవేశపెట్టింది. AI సహాయంతో ఇది వినియోగదారుల యాప్‌లు, ఇమెయిల్‌లు, నోటిఫికేషన్‌ల నుండి ముఖ్యమైన సమాచారాన్ని తక్షణమే సంగ్రహించి వారికి చూపిస్తుంది. ఈ ఫీచర్ లేకపోవడం వల్ల పిక్సెల్ 10aను ఇతర ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుండి వేరు చేయవచ్చు. పిక్సెల్ 9ఎను గూగుల్ గత ఏడాది మార్చిలో ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. అటువంటి పరిస్థితిలో పిక్సెల్ 10ఎ కూడా అదే టైమ్‌లైన్‌ను అనుసరిస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్‌.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి