PM Kisan: దీపావళికి ముందే రైతులకు శుభవార్త అందుతుందా? పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు?
PM Kisan Scheme: ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మీరు ఇంకా e-KYCతోపాటు భూమి ఉన్నట్లు ధృవీకరణను పూర్తి చేయకపోతే మీ వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుకు..

PM Kisan: వ్యవసాయం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భాగం. దేశ జనాభాలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అలాగే వ్యవసాయంతో ముడిపడి ఉన్నారు. కానీ రైతులు తరచుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు
ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6 వేల రూపాయల సహాయం అందిస్తుంది. ఈ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు మూడు విడతలుగా, అంటే ప్రతి నాలుగు నెలలకు 2 వేల రూపాయల వాయిదాలలో జమ అవుతుంది. ఇప్పటివరకు దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ పథకం 20 వాయిదాలను అందుకున్నారు. ఇప్పుడు రైతులు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.
21వ విడత దీపావళికి అందుబాటులోకి వస్తుందా?
ఇప్పుడు రైతులు 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి దీపావళికి ముందే ప్రభుత్వం ఈ విడత ఇస్తుందో లేదో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన రూ.20000 రూపాయల వాయిదాలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వస్తాయి. చివరి 20వ విడత 2025 ఆగస్టు 2న విడుదలైంది. తదుపరి విడత 2025 నవంబర్ లేదా డిసెంబర్‌లో రావాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. 21వ విడత నవంబర్ లేదా డిసెంబర్‌లోనే వచ్చే అవకాశం ఉంది. అంటే ఈసారి దీపావళికి ముందు వాయిదా వచ్చే అవకాశం తక్కువ. కానీ ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. రైతులు మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు.
వాయిదా రాకముందే ఈ పని చేయండి:
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మీరు ఇంకా e-KYCతోపాటు భూమి ఉన్నట్లు ధృవీకరణను పూర్తి చేయకపోతే మీ వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుకు లింక్ చేయడం కూడా అవసరం. ఈ పనులు పూర్తి చేయని రైతులకు తదుపరి వాయిదాకు డబ్బు లభించదు.
ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. వీటిపై భారీ డిస్కౌంట్లు
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








