AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Prices: బైక్‌ ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గనున్న బైక్‌ల ధరలు!

Two Wheelers Prices: ప్రభుత్వ ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే పండుగల సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని..

Bike Prices: బైక్‌ ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గనున్న బైక్‌ల ధరలు!
Subhash Goud
|

Updated on: Sep 04, 2025 | 1:55 PM

Share

Bike Prices: 56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం 12, 28 శాతం రెండు స్లాబ్‌లపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రధానంగా 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిలో చాలా వస్తువులు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు 22 సెప్టెంబర్ 2025 నుండి అమల్లోకి వస్తాయి. దీని కారణంగా ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ హీరో స్ప్లెండర్, స్కూటర్ హోండా యాక్టివా వంటి బైక్‌ల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మీరు మీకోసం కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కొత్త జీఎస్టీ రేటు అమలులోకి వచ్చిన తర్వాత మీరు కొత్త బైక్ కోసం ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!

350cc కంటే తక్కువ సామర్థ్యం గల బైకులు:

350 సిసి కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన బైక్‌లపై GST 28% నుండి 18% కి తగ్గించింది కేంద్రం. దీని కారణంగా సామాన్యులకు ఇష్టమైన బజాజ్ పల్సర్ లేదా హోండా యాక్టివా వంటి బైక్‌లు ఇప్పుడు మునుపటి కంటే చౌకగా మారతాయి.

ఇవి కూడా చదవండి

350cc కంటే పెద్ద బైక్‌లు:

మీరు 350 సిసి కంటే పెద్ద కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి క్రూయిజర్ బైక్‌లపై ఇప్పుడు 40 శాతం జిఎస్‌టి వసూలు చేస్తోంది. గతంలో వీటిపై 28 శాతం జిఎస్‌టి, 3-5 శాతం సెస్ విధించేవారు. ఇది మొత్తం 32 శాతం పన్ను. ఇప్పుడు సెస్ తొలగించింది. 40 శాతం ఫ్లాట్ టాక్స్ విధిస్తుంది.

ఇది కూడా చదవండి: GST Hiked: సిగరెట్లు, గుట్కా, ఫాస్ట్ ఫుడ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. 40 శాతం పన్ను.. ఇక జేబుకు చిల్లులే..!

హీరో స్ప్లెండర్ ప్లస్ ధర ఎంత తగ్గుతుంది?

ప్రభుత్వ ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే పండుగల సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తారు. ఉదాహరణకు కొత్త జీఎస్టీ రేటు అమలు చేసిన తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ధర ఎంత ఉంటుందో చూద్దాం. ఢిల్లీలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 79,426. ఈ బైక్‌పై GSTలో దాదాపు 10 శాతం తగ్గింపు అమలు చేస్తే దాని ధర రూ. 7,900 తగ్గించవచ్చు. ఇది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

బీమా, ఆర్టీవో ఛార్జీలు ఛార్జీలు జోడిస్తే..

బైక్ ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఇందులో RTO ఛార్జీలు రూ. 6,654, బీమా ప్రీమియం రూ. 6,685, ఇతర ఛార్జీలు దాదాపు రూ. 950 ఉన్నాయి. అందుకే ఇవన్నీ కలిపితే ఢిల్లీలో స్ప్లెండర్ ప్లస్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 93,715 కి చేరుకుంటుంది. పన్ను తగ్గింపు ప్రభావం పూర్తిగా అమలు చేస్తే రాబోయే కాలంలో ఈ బైక్ మునుపటి కంటే చాలా తక్కువ ధరల్లో లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Milk Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పాల ధరలు.. ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: BSNL: ప్రత్యేక ఆఫర్‌ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..