AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Gold: బంగారంపై జీఎస్టీ ఎంత..? రూ.లక్ష నగలు కొంటే ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా..?..

బంగారం అనేది దేశ సంప్రదాయంలో ఒక భాగం. వేడుక ఏదైన మహిళలు మొదట కొనేది బంగారం. ప్రస్తుతం బంగారం ధర రూ. లక్ష దాటింది. ఇది సామాన్యులకు గుదిబండగా మారింది. అయితే కేంద్రం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. మరి బంగారంపై జీఎస్టీ ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

GST on Gold: బంగారంపై జీఎస్టీ ఎంత..? రూ.లక్ష నగలు కొంటే ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా..?..
Krishna S
|

Updated on: Sep 04, 2025 | 3:27 PM

Share

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పండుగ లేదా శుభాకార్యం వచ్చిందంటే చాలూ మహిళలకు బంగారం ఉండాల్సిందే. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే కేంద్రం జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఎన్నో వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. ఈ క్రమంలో బంగారంపై జీఎస్టీ తగ్గిందా..? పెరిగిందా..? అనేదానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే బంగారంపై పన్నులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చాలా వస్తువులపై జీఎస్‌టీ రేట్లు మారినా, బంగారం, వెండిపై పన్ను రేటు మాత్రం స్థిరంగా ఉంది.

బంగారంపై జీఎస్టీ రేటు..

బంగారం బార్లు, నాణేలు, ఆభరణాలపై 3 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. అయితే నగల తయారీ ఖర్చుపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.1,00,000 విలువైన బంగారు బారు లేదా నాణెం కొనుగోలు చేస్తే.. దానిపై 3 శాతం అంటే రూ.3,000 జీఎస్టీ పడుతుంది. మొత్తం ఖర్చు రూ.1,03,000 అవుతుంది.

ఒకవేళ మీరు రూ.1,00,000 విలువైన బంగారు ఆభరణాలు కొంటే.. బంగారం విలువపై 3 శాతం జీఎస్టీ (రూ.3,000) పడుతుంది. దీనికి అదనంగా తయారీ ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు తయారీ ఖర్చు రూ.10,000 అయితే, దానిపై 5 శాతం జీఎస్టీ (రూ.500) పడుతుంది. ఈ మొత్తం ట్యాక్స్ రూ.3,500 అవుతుంది.

పన్నులు ఎలా లెక్కిస్తారు?

బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించే బిల్లులో ఈ కింది ఛార్జీలు ఉంటాయి:

బంగారం విలువ: కొనుగోలు చేసే రోజున బంగారం బరువు, స్వచ్ఛత (క్యారెట్) ఆధారంగా దాని విలువ లెక్కిస్తారు.

తయారీ ఖర్చులు: ఆభరణాలు రూపొందించడానికి అయ్యే ఖర్చు ఇది. ఇది బంగారం విలువపై 8శాతం నుంచి 25% వరకు ఉండొచ్చు.

వేస్టేజీ ఛార్జీలు: నగలు తయారు చేసేటప్పుడు కొంత బంగారం వృథా అవుతుంది. దీనికి వేస్టేజీ ఛార్జీలు లెక్కిస్తారు. ఇది బంగారం బరువుపై ఆధారపడి ఉంటుంద. కొన్ని షాపులు వేస్టేజీ, తయారీ ఖర్చులను కలిపి “వాల్యూ అడిషన్” అని కూడా పిలుస్తాయి.

జీఎస్టీ: బంగారం విలువ, తయారీ ఖర్చులు, వేస్టేజీ మీద 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కేవలం బంగారం విలువపై 3శాతం జీఎస్టీ, తయారీ ఖర్చులపై 5శాతం జీఎస్టీ విడివిడిగా లెక్కిస్తారు.

జీఎస్టీలో మార్పులు వచ్చినా, బంగారంపై 3 శాతం జీఎస్టీ, తయారీ ఖర్చులపై 5 శాతం జీఎస్టీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో బులియన్, నగల వ్యాపారులకు పండుగ సీజన్లలో వ్యాపారం చేయడానికి మరింత సౌలభ్యం ఏర్పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం? ఎన్ని ఉంటే మంచిది తెలుసుకోండి!
ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం? ఎన్ని ఉంటే మంచిది తెలుసుకోండి!
నాగబాబు మేము‘కాప్’లం ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాగబాబు మేము‘కాప్’లం ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నో వెహికల్ డే.. వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
నో వెహికల్ డే.. వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
అన్నాడీఎంకే ‘అంతం’ ఆరంభమైందా..?
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..