Mini Projector: రూ.4740లకే అద్దిరపోయే ప్రొజెక్టర్.. ఇంటినే సినిమా హాల్‌‌లా మార్చగలదు.. ఫీచర్లు, ధర, ఆఫర్ వివరాలివే..

ఇంట్లో ఖరీదైన స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ఉన్నా థియేటర్‌లో సినిమాలు చూసిన అనుభూతి కలగనే కలగదు. అందుకోసం చాలా మంది తమ ఇంటిలో..

Mini Projector: రూ.4740లకే అద్దిరపోయే ప్రొజెక్టర్.. ఇంటినే సినిమా హాల్‌‌లా మార్చగలదు.. ఫీచర్లు, ధర, ఆఫర్ వివరాలివే..
Portable Mini Projector With Bluetooth Connectivity
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 16, 2023 | 9:50 PM

Mini Projector: ప్రస్తుత కాలంలో ఎల్‌ఈడీ టీవీ ఇంట్లో ఉండడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఇంట్లో ఖరీదైన స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ఉన్నా థియేటర్‌లో సినిమాలు చూసిన అనుభూతి కలగనే కలగదు. అందుకోసం చాలా మంది తమ ఇంటిలో వేల రూపాయలు ఖర్చుచేసి మరీ ప్రొజెక్టర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. కానీ అందరికి ఇది సాధ్యం కాని విషయం. కానీ ప్రొజెక్టర్‌ ద్వారా సినిమాలు చూడాలనుకుంటే మాత్రం అవకాశం ఉంది. అలాంటి అనుభూతిని కోరుకునే వారి కోసమే అత్యంత చౌకైన మినీ ప్రొజెక్టర్‌‌ను తీసుకొచ్చింది ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా బడ్జెట్‌ ధరలోనే సులభంగా లభిస్తుంది. మరి ఈ మినీ ప్రొజెక్టర్ ఫిచర్లు, ధర వంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మనీ ప్రొజెక్టర్ పేరు UNIY UY40. దీని రిజల్యూషన్ 800×480, స్క్రీన్ సైజ్ 35×120 అంగుళాలు ఉంటుంది. కనెక్ట్ HDMI/AV/AUX/USB (1000 lm / రిమోట్ కంట్రోలర్). ఇక ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ప్రొజెక్టర్ అతిపెద్ద లక్షణం దాని డిజైన్ ఇంకా ధర. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ధర రూ.12,661 అయినప్పటికీ దానిపై 62% తగ్గింపు కూడా లభిస్తుంది. ఫలితంగా కస్టమర్‌లు దీనిని కేవలం రూ.4740కే కొనుగోలు చేయవచ్చు.

LED చిప్‌సెట్‌, HD రిజల్యూషన్‌తో కూడిన ఈ ప్రొజెక్టర్‌లో చాలా ఫీచర్లను ఈ మినీ ప్రొజెక్టర్‌లో పొందుతారు. అంతేకాక  30,000 గంటల ల్యాంపోలేతో పాటు, ఫేస్ ప్రొజెక్టర్‌తో గరిష్టంగా 1000 ల్యూమన్‌ల బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని కారణంగా వినియోగదారులు సినిమాలను చూడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే థియేటర్‌లో మూవీ చూసిన లాంటి అనుభూతిని పొందుతారు. ఇది పోర్టబుల్ ప్రొజెక్టర్ అయినందున దానిని మీ బ్యాగ్‌లో పెట్టుకొని ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇది చాలా తేలికగా ఉండడమే కాక అతి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తలు చదవండి..