Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boult Swing Smartwatch : డిఫరెంట్ లుక్‎తో బోల్ట్ స్వింగ్ నయా బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్…తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు..!!

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ బోల్ట్‌ తాజాగా బౌల్ట్‌ స్విగ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ వాచ్‌ ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Boult Swing Smartwatch : డిఫరెంట్ లుక్‎తో బోల్ట్ స్వింగ్ నయా బ్లూటూత్ కాలింగ్‌  స్మార్ట్‌వాచ్...తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లు..!!
Boult Smart Watch
Follow us
Madhavi

| Edited By: Narender Vaitla

Updated on: Feb 17, 2023 | 7:57 AM

మొబైల్ నోటిఫికేషన్ల దగ్గరి నుంచి ఆరోగ్య సమాచారం వరకు ముఖ్యమైన ఫీచర్లు ఉండటంతో స్మార్ట్ వాచ్ ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. ఈ మధ్యకాలంలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్‎వాచ్ లవైపు ఎక్కువ మంది యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో బోల్ట్ బ్రాండ్ వరుసగా భారతదేశంలో స్మార్ట్‎వాచ్ లను విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బోల్ట్ స్వింగ్ వాచ్ ను మార్కెట్లోకి కొత్తగా తీసుకువచ్చింది. బోల్ట్ స్వింగ్ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

బౌల్ట్ స్వింగ్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్:

బౌల్ట్ స్వింగ్ వాచీలో 1.9-అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇంకా, ముందుగానే చెప్పినట్లుగా ఈ స్మార్ట్ వాచీలో బ్లూటూత్ కాలింగ్‌ కూడా ఉంది. స్మార్ట్‌వాచ్‌లో ప్రత్యేకమైన స్పీకర్ అలాగే మైక్రోఫోన్ యూజర్లు లీనమయ్యే పూర్తి అనుభవాన్ని అందించడానికి ఉంది. మార్కెట్‌లోని అన్ని ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే, బౌల్ట్ స్వింగ్ ఆరోగ్య సమాచారాన్ని యూజర్ కు తెలిపేందుకు SpO2మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ కౌంట్, ఫిట్ నెస్, బీపీ,మెన్ స్ట్రువల్ ట్రాకింగ్ తోపాటుగా హైడ్రేషన్ రిమైండర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ గురించి. యూజర్ కాలింగ్ కోసం ప్రతిసారీ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా డయల్ పాడ్, కాల్ హిస్టరీ, కాల్ డేటా సింక్, కాంటాక్ట్స్ ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూజర్ అనుభవాన్ని ఎల్లప్పుడూ తాజాగా, ఉత్సాహంగా ఉంచేందుకు బౌల్ట్ 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. ఇంకా, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫిట్‌నెస్ ఔత్సాహికులు తమ ప్రయాణాన్ని కొనసాగించగలిగేలా చూసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ 0% నుండి పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది బ్రాండ్ క్లెయిమ్ చేస్తుంది. అయితే, నిజ జీవిత వినియోగం విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌వాచ్ ఒక్క ఛార్జ్‌పై గరిష్టంగా 4 నుండి 5 రోజుల మధ్య ఉంటుంది. ఇది కూడా IP67 రేట్ చేయబడింది. అంటే స్మార్ట్ వాచ్ డస్ట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

బౌల్ట్ స్వింగ్ ధర:

బౌల్ట్ స్వింగ్ భారతదేశంలో రూ.1799 ధరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఫిబ్రవరి 16, 2023 నుండి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. బ్లూ, బ్లాక్,పింక్, గ్రీన్, సిల్వర్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..