Oxygen: వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్.. వెల్డింగ్ మిషన్ల కోసం వాడే ఆక్సిజన్ ఒకటేనా? రెండిటి మధ్యలో ఉండే తేడాలు ఏమిటి?

ఆక్సిజన్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ మాటే వినబడుతోంది. కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరత కోవిడ్ పీడితుల ఉసురు తీసేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ తీవ్ర కొరత వేధిస్తోంది.

  • KVD Varma
  • Publish Date - 1:11 pm, Fri, 23 April 21
Oxygen: వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్.. వెల్డింగ్ మిషన్ల కోసం వాడే ఆక్సిజన్ ఒకటేనా? రెండిటి మధ్యలో ఉండే తేడాలు ఏమిటి?
Oxygen

Oxygen: ఆక్సిజన్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ మాటే వినబడుతోంది. కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరత కోవిడ్ పీడితుల ఉసురు తీసేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ తీవ్ర కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ లేకపోవడం కారణంగానే కొన్ని చోట్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని దేశం నలుమూలల నుంచీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఎన్ని విధాలుగా దొరుకుతుంది? వాటి మధ్యలో తేడాలు ఏమిటి? మనం రోజూ గాలి నుంచి తీసుకునేది పూర్తీ ఆక్సిజన్ వాయువేనా? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఆక్సిజన్ మనిషికి ఎందుకోసం?

ఆక్సిజన్ గురించి చెప్పుకునే ముందు.. ఆక్సిజన్ లోటు ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాఠకుల సౌలభ్యం కోసం.. వాడుక భాషలోనే ఈ విషయాన్ని వివరిస్తున్నాం. ఆక్సిజన్ మానవులకు ప్రాణ వాయువుగా చెబుతారని తెలిసిన విషయమే. మానవులలో అన్ని జీవక్రియలకూ ఆధారం ఆక్సిజన్ వాయువు. మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ ఊపిరితిత్తులను చేరుతుంది. ఊపిరితిత్తులు ఆ గాలిని వడబోస్తాయి.. ఆక్సిజన్ ను దాని నుంచి సపరేట్ చేస్తాయి. ఇతర వ్యర్ధ వాయువులను తిరిగి ముక్కు ద్వారానే బయటకు పంపించేస్తాయి. స్వచ్చమైన ఆక్సిజన్ ను గుండెకు చేరవేస్తాయి ఊపిరితిత్తులు. గుండె ఈ ఆక్సిజన్ సహాయంతో మన రక్తంలోని మలినాలను శుభ్ర పరుస్తుంది. సింపుల్ గా ఆక్సిజన్ మన శరీరానికి చేరే ప్రక్రియ ఇది. అయితే, కరోనా వలన ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. దీంతో మనం తీసుకునే గాలిని శుభ్రపరిచి.. ఆక్సిజన్ ను వేరు చేసే పనిలో ఊపిరితిత్తులకు కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. దానితో స్వచ్చమైన ఆక్సిజన్ ను బయట నుంచి ఇవ్వవలసి ఉంటుంది. మొదటి కరోనా వేవ్ లో కరోనా అంత తీవ్రంగా ఊపిరితిత్తులపై దాడి చేయలేదు. కనీ, రెండో వేరియంట్ కాస్త ఎక్కువగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. దాంతో ఎక్కువ మందికి కచ్చితంగా ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. నిజానికి మనం ముక్కు ద్వారా 100% ఆక్సిజన్‌ను పీల్చుకుంటున్నామని ఒక సాధారణ నమ్మకం. అది నిజం కాదు. మనం పీల్చే గాలిలో కేవలం 21 శాతం మాత్రమే ఆక్సిజన్ మరియు 78 శాతం నత్రజని. ఒక శాతం కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ వంటి ఇతర వాయువుల మిశ్రమం ఉంటాయి.

ఆక్సిజన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? తేడాలు ఏమిటి?

బయట కృత్రిమంగా సిద్ధం చేసే ఆక్సిజన్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మెడికల్ ఆక్సిజన్..ఇండస్ట్రియల్ ఆక్సిజన్. రెండూ దాదాపు ఒకే రకమైన ఆక్సిజన్ వాయువులే. రెండూ ఒకే మూలం నుండి వచ్చాయి. అదే విధంగా ఉత్పత్తి అవుతాయి. అయితే, ఆక్సిజన్ ను మెడికల్ గా ఉపయోగించడానికి కొంత కచ్చితమైన విధానం ఉంటుంది. అది స్వచ్చమైనదని సర్టిఫై చేసినదై ఉండాలి. పారిశ్రామికంగా వాడే ఆక్సిజన్ స్వచ్చతకు ప్రమాణాలు ఉండవు.

మనం మాట్లాడుకునే విధానంలో ఆక్సిజన్.. మెడికల్ ఆక్సిజన్ అని వేర్వేరుగా చెప్పుకుంటాం కానీ, సాధారణ ఆక్సిజన్ కు, మెడికల్ ఆక్సిజన్ కు మధ్య పెద్దగా తేడా ఉండదు. పారిశ్రామిక ఆక్సిజన్ దహన, ఆక్సీకరణ, కట్టింగ్ ,రసాయన ప్రతిచర్యలతో సహా పారిశ్రామిక ప్లాంట్లలో ఉపయోగాల కోసం తాయారు చేస్తారు. పారిశ్రామిక స్వచ్ఛత స్థాయిలు మానవ వినియోగానికి తగినవి కావు. అదేవిధంగా అవి మురికి పరికరాలు లేదా పారిశ్రామిక నిల్వ నుండి రావడంతో మలినాలు ఉండవచ్చు, అవి ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తాయి. అదేసమయంలో మెడికల్ ఆక్సిజన్ సిలెండర్లు కలుషితాలు లేకుండా.. ఆ సిలేన్దర్లను ఆక్సిజన్ సరఫరా కోసం మాత్రమె ఉపయోగిస్తున్నారని ధృవీకరణ కచ్చితంగా ఉండాలి. ఒకసారి ఉపయోగించిన సిలిండర్లు.. సిలిండర్లను ఖాళీ చేసి, పూర్తిగా శుభ్రం చేసి, తగిన విధంగా లేబుల్ చేయకపోతే వైద్య-గ్రేడ్ ఆక్సిజన్ కోసం ఉపయోగించకూడదు. మెడికల్ ఆక్సిజన్ వివిధ రకాల అవసరాల కోసం ఉపయోగించబడుతుంది. సాధారణంగా వైద్య ఆక్సిజన్ ఆసుపత్రులు, క్లినిక్‌ల వంటి వైద్య సదుపాయాలలో నిర్వహించబడుతుంది. ఇది అనస్థీషియా, అత్యవసర పరిస్థితులకు ప్రథమ చికిత్స కోసం, పునరుజ్జీవం, సొంతంగా ఊపిరి పీల్చుకోలేని రోగులకు లైఫ్ సేవింగ్ గా చికిత్స సమయంలో ఉపయోగిస్తారు, అదేవిధంగా అథ్లెట్లు అధిక ఎత్తులో, శిక్షణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో వైద్య ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. ఇక వినియోగదారు భద్రతకు భరోసా ఇవ్వడానికి మెడికల్ ఆక్సిజన్‌కు ప్రిస్క్రిప్షన్ అవసరం. రోగులు వారి అవసరాలకు సరైన శాతం ఆక్సిజన్ పొందాల్సి ఉంటుంది. వేర్వేరు ప్రజలు వేర్వేరు పరిమాణాలు, వారి నిర్దిష్ట వైద్య పరిస్థితుల కోసం వివిధ రకాల వైద్య ఆక్సిజన్ అవసరం కాబట్టి, ఒకే పరిమాణంలో ఆక్సిజన్ అనే విధానం సరిపోదు. అందుకే ఒక సిలెండర్ నుంచి ఎవరికీ ఎంత అవసరమో.. ఎంత సమయం అవసరమో అంత సేపు ఒక పధ్ధతి ప్రకారం ఆక్సిజన్ ఇస్తారు. అందువల్ల ఇది డాక్టర్ పర్యవేక్షణలో.. వారి పిస్క్రిప్షన్ ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. కొంతమంది వెల్డింగ్ వర్కర్లు వారు వాడే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ను ఒక్కోసారి నేరుగా పీలుస్తారు. ఇది సాధారణంగా మద్యం హ్యంగోవర్ తప్పించుకోవడం కోసం జరుగుతుంది. అయితే, ఈ ఆక్సిజన్ స్వచ్చత లేనిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనిని పీల్చడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శుభ్ర పరచని సిలెండర్ల నుంచి సరఫరా అయ్యే ఈ ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా అందులోని మలినాలు కూడా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం పాలు చేసే అవకాశం ఉంటుంది.

Also Read: Viral News: ఎత్తైన పర్వతంపై చిరుతపులి వేట.. కిందకు పడుతున్నా ఎరను విడవలేదు.. షాకింగ్ దృశ్యాలు..

‘ఎవరెస్ట్ శిఖరానికెక్కిన కోవిడ్ 19’, బేస్ క్యాంపులో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్, ఆసుపత్రికి తరలింపు