Computer: రాత్రుళ్లు కంప్యూటర్ ముందు పనిచేస్తున్నారా.? అయితే ఈ ఫీచర్ మీకోసమే..
Computer: అదేపనిగా కంప్యూటర్ చూస్తే కళ్లకు ఇబ్బంది కలుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కంప్యూటర్‌లలో పనిచేసే వారే అధికం. మరీ ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్‌లో పనిచే చేసే..

Computer: అదేపనిగా కంప్యూటర్ చూస్తే కళ్లకు ఇబ్బంది కలుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కంప్యూటర్‌లలో పనిచేసే వారే అధికం. మరీ ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్‌లో పనిచే చేసే వారికి కంప్యూటర్ నుంచి వెలువడే నీలి కాంతి కంటి సమస్యలకు దారి తీస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా మనకు నిద్ర రావడానికి మెలటోనిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. అయితే కంప్యూటర్ల నుంచి వెలువడే నీలి కాంతి ఈ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అయితే రాత్రిపూట కంప్యూటర్ ముందు పనిచేసే వారి కోసం విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఓ మంచి ఫీచర్ ఉందన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు.?
అవును ‘నైట్ లైట్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కంటిపై కాంతి ప్రభావం పడకుండా జాగ్రత్తపడొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనేగా మీ సందేహం. ఇందుకోసం ముందుగా స్టార్ట్ బటన్‌లోకి వెళ్లి, సెటింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ‘సిస్టమ్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ‘డిస్‌ప్లే’లో వెళ్లాలి. తర్వాత కలర్ అనే ఫీచర్‌లో ‘నైట్ లైట్’ ఆప్షన్ కనిపిస్తుంది.
దీనిని ఎనేబుల్ చేసుకుంటే కంప్యూటర్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఆగిపోతుంది. స్క్రీన్ అంత ఆరెంజ్ కలర్‌లోకి మారుతుంది. చూశారుగా రాత్రుళ్లు కంప్యూటర్ ముందు పనిచేసే వారు ఈ సింపుల్ టిప్‌తో కళ్లను రక్షించుకోవచ్చన్నమాట.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..