- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new premium smart tv Xiaomi TV IS pro 86 inch price and details
Xiaomi TV ES pro 86 inch: షావోమి నుంచి భారీ స్మార్ట్ టీవీ.. 86 ఇంచెస్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు..
Xiaomi TV ES pro 86 inch: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమి తాజాగా ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 86 ఇంచెస్ స్క్రీన్‌తో తీసుకొచ్చిన ఈ టీవీ ప్రస్తుతం చైనాలో లాచ్ అయింది. త్వరలోనే భారత్‌లోకి రానున్న ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: May 27, 2022 | 6:35 AM

షావోమీ తాజాగా కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానుంది.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 86 ఇంచుల 4K రెజల్యూషన్ డిస్‌ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. పరిసరాల వెలుతురును బట్టి బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యేలా లైట్ సెన్సార్ ఈ టీవీ ప్రత్యేకత.

క్వాడ్ కోర్ క్రోటెక్స్-ఏ73 ప్రాసెసర్‌పై పనిచేస్తే ఈ స్మార్ట్ టీవీలో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ అందించారు. టీవీలో ఇన్‌బిల్ట్‌గా ఎనిమిది స్పీకర్లు అందించారు.

కనెన్టివిటీ విషయానికొస్తే ఇందులో ఒక HDMI 2.1 పోర్ట్, రెండు HDMI 2.0 పోర్ట్‌లు, రెండు USB పోర్ట్, ఇథెర్‌నెట్ పోర్ట్, AVI ఇన్‌పుట్లు అందించారు. అలాగే డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇచ్చారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీ చైనాలో 8,499కి అందుబాటులో ఉంది. అంటే మరో కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 98,900గా ఉండనుంది.




