- Telugu News Photo Gallery Technology photos Searching for smart phone under 20k Oneplus nord ce 2 lite 5g is the best option have a look on features
Oneplus nord ce 2 lite 5g: రూ. 20 వేలలోపు వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు..
Oneplus nord ce 2 lite 5g: తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? మీకోసమే వన్‌ప్లస్ తాజాగా నార్డ్ సీఈ 2 లైట్ అనే ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: May 28, 2022 | 6:30 AM

స్మార్ట్ ఫోన్‌ల తయారీలో వన్‌ప్లస్ బ్రాండ్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఈ బ్రాండ్ పేరు వినగానే ప్రీమియం ఫోన్‌లు గుర్తుకొస్తాయి. కానీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌కు సపోర్ట్ చేస్తుంది. క్లీన్ Android UI ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 120Hzతో కూడిన 6.59 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఇచ్చారు.




