AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WiFi Speed: మీ రూటర్ మీద నాణేలు పెడుతున్నారా? రూపాయి బిల్లతో వైఫై స్పీడ్ పెరుగుతుందా.. ప్రాణాలకే ప్రమాదం!

WiFi Speed: సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో వెనుక ఉండే వాస్తవికతను సరిచూసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. మీ వైఫై సిగ్నల్ పెంచుకోవడానికి రూటర్ ని ఇంటి మధ్యలో, ఎత్తైన ప్రదేశంలో ఉంచడం మంచిది కానీ, ఇలాంటి నాణేల ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకండి..

WiFi Speed: మీ రూటర్ మీద నాణేలు పెడుతున్నారా? రూపాయి బిల్లతో వైఫై స్పీడ్ పెరుగుతుందా.. ప్రాణాలకే ప్రమాదం!
Wifi Speed
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 06, 2026 | 2:54 PM

Share

WiFi Speed: నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వేగం ప్రాణవాయువుతో సమానం. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ‘టెక్ హ్యాక్స్’ (Tech Hacks) సామాన్య వినియోగదారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముఖ్యంగా వైఫై రూటర్లపై నాణేలు (Coins) ఉంచితే సిగ్నల్ పెరుగుతుందని, రూటర్ నుంచి వచ్చే వేడిని అవి గ్రహిస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. లక్షలాది మంది ఈ ట్రిక్ నిజమని నమ్మి తమ రూటర్ల మీద నాణేలను కుప్పలుగా పెడుతున్నారు. కానీ, ఈ చిన్న పొరపాటు మీ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించడమే కాకుండా, మీ ఇంటిని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి వైఫై రూటర్లు రేడియో తరంగాల (Radio Waves) ద్వారా పనిచేస్తాయి. రూటర్ పై లోహపు నాణేలను ఉంచడం వల్ల యాంటెన్నా నుంచి వచ్చే సిగ్నల్స్ మెరుగుపడవు సరే కదా, ఉన్న సిగ్నల్ కూడా డిస్టార్షన్ (Distortion) కు గురవుతుంది. లోహం అనేది సిగ్నల్స్‌ను అడ్డుకుంటుంది లేదా పక్కకు మళ్లిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం పక్కన పెడితే, కనెక్షన్ డ్రాప్ అవ్వడం, రేంజ్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. టెక్నికల్‌గా ఇది ఎలాంటి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చదు సరే కదా, ఉన్న పనితీరును దెబ్బతీస్తుంది.

మరోవైపు నాణేలు వేడిని గ్రహిస్తాయని (Heat absorption) భావించడం కూడా పెద్ద పొరపాటే. రూటర్ నుంచి వచ్చే వేడిని నాణేలు బయటకు పంపవు. పైగా రూటర్ వెలుపల వేడిని ఒకే చోట కేంద్రీకరించేలా చేస్తాయి (Trap heat). దీనివల్ల లోపల ఉన్న సర్క్యూట్ బోర్డ్ ఓవర్ హీట్ అయ్యి, కాలక్రమేణా రూటర్ పాడైపోయే అవకాశం ఉంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే (Fire hazard) అవకాశం కూడా లేకపోలేదు.

వైరల్ వీడియోలు చూసి గుడ్డిగా అనుసరించడం వల్ల కలిగే నష్టాలివి. కేవలం వ్యూస్ కోసం చేసే ఇలాంటి ప్రయోగాలు సామాన్య వినియోగదారుల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను దెబ్బతీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. ఇన్ ఫ్లుయెన్స్ అవ్వడం కంటే, ఇన్ ఫార్మ్డ్ గా ఉండటమే ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా టెక్ సమస్య ఉంటే రూటర్ పొజిషన్ మార్చడం లేదా రీసెట్ చేయడం వంటి ప్రామాణిక పద్ధతులను పాటించడం శ్రేయస్కరం.

వార్తా కథనాల్లో వచ్చే ఇలాంటి టెక్ హెచ్చరికలను గమనిస్తూ ఉండటం ద్వారా మీ పరికరాలను భద్రంగా ఉంచుకోవచ్చు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో వెనుక ఉండే వాస్తవికతను సరిచూసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. మీ వైఫై సిగ్నల్ పెంచుకోవడానికి రూటర్ ని ఇంటి మధ్యలో, ఎత్తైన ప్రదేశంలో ఉంచడం మంచిది కానీ, ఇలాంటి నాణేల ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకండి.

ఇది కూడా చదవండి: RBI కొత్త ప్రతిపాదన.. లోన్ డబ్బులు కట్టకపోతే మీ ఆస్తి బ్యాంక్ వశం.. జాగ్రత్త..!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us