AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్ గురించి తెలుసా..?

WhatsApp Calls: నార్మల్ ఫోన్ కాల్స్‌కు ఉన్నట్లుగా వాట్సాప్ యాప్‌లో నేరుగా రికార్డింగ్ ఆప్షన్ ఉండదు బాస్. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో కాల్‌ను ఎలా రికార్డ్ చేయాలో తెలియక చాలామంది తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ఉండే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే వాట్సాప్ కాల్స్‌ను కూడా చాలా ఈజీగా రికార్డ్ చేయవచ్చు. ఆ సీక్రెట్ చిట్కాలు తెలుసుకుందాం..

వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్ గురించి తెలుసా..?
How To Record Whatsapp Calls
Krishna S
|

Updated on: May 31, 2026 | 1:45 PM

Share

అది ముఖ్యమైన ఆఫీస్ కాల్ అయినా లేదా ప్రియమైన వారితో చేసే మధురమైన సంభాషణ అయినా.. కొన్నిసార్లు మనకు వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయాలనిపిస్తుంది. అయితే సాధారణ ఫోన్ కాల్స్‌కు ఉన్నట్లుగా వాట్సాప్ యాప్‌లో నేరుగా రికార్డ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ అధికారిక ఫీచర్‌ను అందించలేదు. మరి వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా? మరీ ఎక్కువగా టెన్షన్ పడకండి.. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ కాల్స్‌ను రికార్డ్ చేయడానికి కొన్ని సులభమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఏ ఫోన్‌లో ఎలా రికార్డ్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ ఫోన్లలో రికార్డింగ్ ఎలా?

చాలావరకు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇన్ బిల్ట్‌గా స్క్రీన్ రికార్డర్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వాట్సాప్ కాల్స్‌ను ఈజీగా రికార్డ్ చేయవచ్చు.

స్క్రీన్ రికార్డర్ ఆన్ చేయండి: వాట్సాప్ కాల్ మాట్లాడే ముందు మీ ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుండి స్క్రీన్ రికార్డర్‌ను ఆన్ చేయండి.

ఆడియో సెట్టింగ్స్: స్క్రీన్ రికార్డర్ సెట్టింగ్స్‌లో రికార్డ్ ఆడియో ఆప్షన్‌ను మైక్ లేదా సిస్టమ్ సౌండ్‌గా మార్చడం ముఖ్యం.

ఆ తర్వాత వాట్సాప్ కాల్ మాట్లాడి.. కాల్ ముగిసిన తర్వాత రికార్డింగ్‌ను ఆపివేస్తే.. ఆడియోతో కూడిన వీడియో ఫైల్ మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది.

ఇంటర్నల్ ఆడియో రికార్డ్ కాకపోతే ఏం చేయాలి?

భద్రతా కారణాల వల్ల కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇంటర్నల్ ఆడియోను నేరుగా రికార్డ్ చేయనివ్వవు. అటువంటి సందర్భంలో మీరు కాల్ సమయంలో ఫోన్‌ను స్పీకర్‌ ఆన్ చేసి మైక్ ద్వారా ధ్వనిని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇరువైపుల వాయిస్ రికార్డ్ అవుతుంది. అయితే చుట్టుపక్కల శబ్దాలు కూడా రికార్డింగ్‌లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నిశ్శబ్దమైన ప్రదేశంలో ఉండి కాల్ మాట్లాడటం మంచిది.

థర్డ్ పార్టీ యాప్స్ విషయంలో జాగ్రత్త

ప్లే స్టోర్‌లో చాలా వాట్సాప్ కాల్ రికార్డింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నకిలీ యాప్‌లు మీ కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారిక రేటింగ్‌లు, యూజర్ రివ్యూలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాటిని వాడాలి.

ఐఫోన్ యూజర్లకు ఉన్న ఆప్షన్స్ ఏంటి?

ఆపిల్ కఠినమైన భద్రతా విధానాల కారణంగా ఐఫోన్‌లో నేరుగా స్క్రీన్ రికార్డర్ ద్వారా వాట్సాప్ కాల్ ఆడియోను రికార్డ్ చేయడం సాధ్యం కాదు. దీనికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి:

మ్యాక్‌బుక్ సహాయంతో: మీ వద్ద మ్యాక్‌బుక్ ఉంటే ఐఫోన్‌ను కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి క్విక్‌టైమ్ ప్లేయర్‌లో న్యూ ఆడియో రికార్డింగ్‌ను ఎంచుకోవాలి. ఆపై వాట్సాప్ కాల్‌ను స్పీకర్‌పై పెట్టి మ్యాక్‌లో రికార్డ్ చేయవచ్చు.

రెండవ ఫోన్ లేదా వాయిస్ రికార్డర్: ఐఫోన్ కాల్‌ను స్పీకర్‌ మోడ్‌లో పెట్టి పక్కన మరో ఫోన్ లేదా వాయిస్ రికార్డర్ ఉంచి రికార్డ్ చేయడం అత్యంత సాధారణ పద్ధతి. ఇందులో ఆడియో క్వాలిటీ కొద్దిగా తక్కువగా రావచ్చు.

చట్టబద్ధత – అనుమతి చాలా అవసరం

ఏదైనా కాల్‌ను రికార్డ్ చేసే ముందు అవతలి వ్యక్తి అనుమతి తీసుకోవడం మర్యాద మాత్రమే కాదు, చట్టరీత్యా కూడా చాలా ముఖ్యం. దేశంతో సహా అనేక దేశాలలో, అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా వ్యక్తిగత సంభాషణలను రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం కావచ్చు. కేవలం ఉద్యోగ, చట్టపరమైన లేదా సాక్ష్యాల కోసం మాత్రమే రికార్డింగ్స్ వాడాలి.

రికార్డ్ చేసిన ఫైల్స్ సేఫ్టీ ముఖ్యం

ఈ కాల్ రికార్డింగ్‌లలో మీ వ్యక్తిగత, బ్యాంక్ లేదా ఆఫీస్ సమాచారం ఉండవచ్చు. కాబట్టి ఈ ఫైళ్లను దుర్వినియోగం కాకుండా లాక్ చేసిన ఫోల్డర్‌లో లేదా పాస్‌వర్డ్ రక్షిత డ్రైవ్‌లో ఉంచండి. వీటిని వాట్సాప్ గ్రూపులలో లేదా సోషల్ మీడియాలో అనవసరంగా షేర్ చేయవద్దు.

Follow Us