RBI కొత్త ప్రతిపాదన.. లోన్ డబ్బులు కట్టకపోతే మీ ఆస్తి బ్యాంక్ వశం.. జాగ్రత్త..!
RBI New Rules: వసూళ్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆర్‌బీఐ కీలక నిబంధన పెట్టింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి అదే రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వ్యక్తులకు గానీ విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలపై మే..

RBI New Rules: బ్యాంకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొరడా ఝుళిపిస్తోంది. మొండి బకాయిల (NPA) వసూళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంకులు, NBFCల కోసం ఆర్‌బీఐ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించలేకపోతే సెక్యూరిటీగా ఉంచిన ఇల్లు లేదా భూమి వంటి స్థిర ఆస్తులను (Immovable Properties) బ్యాంకులు నేరుగా తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చు.
ఏడేళ్ల పరిమితి:
స్వాధీనం చేసుకున్న ఆస్తులను బ్యాంకులు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోవడానికి వీల్లేదు. వీటిని గరిష్టంగా 7 ఏళ్లలోపు విక్రయించి తమ బకాయిలను వసూలు చేసుకోవాలి.
ఎప్పుడు వర్తిస్తుంది?:
అన్ని రకాల రుణాలకు ఇది వర్తించదు. కేవలం మొండి బకాయిలుగా (NPA) మారిన లోన్ల రికవరీ కోసం ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే ఈ చర్యలు చేపడతారు.
పారదర్శకత:
ఈ ఆస్తులను నిర్ణీత సమయంలో, పారదర్శక పద్ధతిలో విక్రయించడం ద్వారా బ్యాంకులకు గరిష్టంగా డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.
SNFA అంటే ఏమిటి?
బ్యాంకులు వసూళ్ల కోసం స్వాధీనం చేసుకునే స్థిర ఆస్తులను Specified Non-Financial Assets (SNFA) గా పరిగణిస్తారు. ఇందులో నాన్-బ్యాంకింగ్ అసెట్స్ కూడా భాగమే. అప్పు తీసుకున్న వ్యక్తి తన బకాయిలకు బదులుగా ఈ ఆస్తులను బ్యాంకుకు అప్పగించే వెసులుబాటు కూడా ఈ డ్రాఫ్ట్‌లో ఉంది.
ఎవరు ఈ ఆస్తులను కొనకూడదు?
వసూళ్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆర్‌బీఐ కీలక నిబంధన పెట్టింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి అదే రుణగ్రహీతకు గానీ లేదా వారికి సంబంధించిన వ్యక్తులకు గానీ విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలపై మే 26వ తేదీ వరకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్‌బీఐ కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
