AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ‘పెద్ది’ కారు చూశారా? రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ మాములుగా లేవుగా? వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Peddi Movie: 'పెద్ది' కారు చూశారా? రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ మాములుగా లేవుగా? వీడియో
Peddi Movie
Basha Shek
|

Updated on: May 06, 2026 | 9:46 AM

Share

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హంగామా మొదలైంది. వినూత్న ప్రమోషన్లతో ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా… ఇప్పుడు మెగా క్యాంప్ దృష్టిని కూడా ఆకర్షించింది. ONESEA MEDIA ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా జరుగుతున్న గ్రౌండ్ లెవల్ ప్రచార కార్యక్రమాలు సినిమాపై భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. కాలేజీల్లో డాన్స్ కాంపిటీషన్లు, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లింది ‘పెద్ది’ టీమ్. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘పెద్ది కార్’ తాజాగా GOLD BOX ఆఫీస్‌కు చేరుకుంది. మెగా డాటర్, ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల స్వయంగా కార్‌ను పరిశీలించి టీమ్ ప్రయత్నాలను అభినందించారు. ‘ఇలాంటి ప్రమోషన్లు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలి” అంటూ టీమ్‌కు సూచనలు చేశారు. అలాగే భవిష్యత్తులో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

వీడియో ఇదిగో..<

/h3>

Follow Us