AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్ర గ్రహం కటాక్షం.. 6 రాశుల ఇళ్లలో డబ్బుల వర్షం! మీ రాశి ఇదేనా?

Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశుల గుండా సంచరిస్తాయి. శుక్రుడు ఆనందం, ప్రేమ, సంపదలకు కారక గ్రహం. ప్రస్తుతం అతను స్వరాశి వృషభంలో ఉండటంతో శక్తివంతంగా ఉన్నాడు. దీంతో వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు ధనలాభాలు, సుఖసంతోషాలు కలగనున్నాయి. మే 14న శుక్రుడు మిథునంలోకి ప్రవేశించడంతో ఈ ఫలితాలు మరింత స్పష్టమవుతాయి.

Rajashekher G
|

Updated on: May 06, 2026 | 1:09 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల గుండా ప్రవేశిస్తూ మారుతూ ఉంటాయి. ఇక, శుక్రుడు ఆనందం, ప్రేమ, విలాసం, సంపదలకు ప్రతీకగా భావించబడే గ్రహం. ప్రస్తుతం శుక్రుడు తన స్వరాశి అయిన వృషభంలో సంచరిస్తుండటం వల్ల అతని శక్తి మరింత పెరిగింది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ధనలాభాలు, సుఖసంతోషాలు కలగనున్నాయి. ముఖ్యంగా శుక్రునికి అనుకూలమైన రాశులు.. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. ఈ కాలంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మే నెల 14న శుక్రుడు వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుంది.

1 / 7

వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడే కావడంతో, ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు కలగవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక అవకాశాలు మీకు అందుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తారు.

2 / 7

కన్య రాశి: శుక్రుడి సంచారం మీ అదృష్ట స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది. జీవనశైలిలో మార్పులు వస్తాయి. పూర్వీకుల ఆస్తి లేదా ఇతర లాభాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి.

3 / 7

తుల రాశి: ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడే. అందువల్ల ద్విగుణీకృత శుభఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా కోరికలు నెరవేరుతాయి. గృహ, కుటుంబ సంబంధ విషయాల్లో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. జీవితం మరింత స్థిరంగా, సంతోషంగా మారుతుంది.

4 / 7

మిథున రాశి: శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల కొంత ఖర్చులు పెరిగే అవకాశమున్నా, విద్యార్థులకు ఇది మంచి కాలం. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి.

5 / 7

మకర రాశి: శుక్రుడు పంచమ భావంలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ, విద్య రంగాల్లో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. జీతం, భత్యాలు పెరుగుతాయి. విదేశీ అవకాశాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.

6 / 7
కుంభ రాశి: శుక్రుడు చతుర్థ భావంలో సంచరించడం వల్ల రాజయోగం, ధనయోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇది మంచి సమయం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కొత్తగా పెళ్లైన వారికి కుటుంబ సంతోషం, శుభవార్తలు లభించవచ్చు.
మొత్తంగా, శుక్రుడి ఈ సంచారం చాలా రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత, వృత్తి పరంగా అభివృద్ధిని అందించేలా ఉంది. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలు ఇవ్వగల సమయం ఇది. అయితే ఖర్చులపై నియంత్రణతో పాటు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

కుంభ రాశి: శుక్రుడు చతుర్థ భావంలో సంచరించడం వల్ల రాజయోగం, ధనయోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇది మంచి సమయం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కొత్తగా పెళ్లైన వారికి కుటుంబ సంతోషం, శుభవార్తలు లభించవచ్చు. మొత్తంగా, శుక్రుడి ఈ సంచారం చాలా రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత, వృత్తి పరంగా అభివృద్ధిని అందించేలా ఉంది. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలు ఇవ్వగల సమయం ఇది. అయితే ఖర్చులపై నియంత్రణతో పాటు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

7 / 7
Follow Us