పెళ్లయిన హీరోయిన్లు రూట్ మార్చేసారుగా..!
ఒకప్పుడు పెళ్లి తర్వాత కెరీర్‌కు దూరమైన హీరోయిన్లు ఇప్పుడు రూట్ మార్చారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోపాటు విభిన్న కథాంశాలతో మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో లావణ్య త్రిపాఠి, సమంత, కాజల్ అగర్వాల్, రష్మిక మందన వంటి ప్రముఖ నటీమణుల సినిమాలు విడుదల కానున్నాయి.
ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ ముగిసిందని భావించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వివాహిత నటీమణులకు ఇప్పుడు అనేక అవకాశాలు లభిస్తున్నాయి, ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా వారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, రాబోయే మూడు నెలల్లో నలుగురు ప్రముఖ నటీమణులు తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సతి లీలావతి సినిమాతో మే 8న రాబోతున్నారు. భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్‌లో దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత కూడా మే నెలలోనే తన సొంత నిర్మాణ సంస్థలో భర్త రాజు నిడమోరు కథా సహకారంతో నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రంతో మే 15న విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ అవుతున్న సారా అర్జున్ లేటెస్ట్ ఫోటో షూట్
టాలీవుడ్ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్
ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

