ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
సినిమా పరిశ్రమలో ఒక హిట్ వంద అవకాశాలు తెస్తే, ఒక డిజాస్టర్ మార్కెట్ విలువను మారుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని కొందరు టాప్ దర్శకులు కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, శేఖర్ కమ్ముల, క్రిష్ వంటి దర్శకులు వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతూ, తిరిగి కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ ఒక సక్సెస్ గ్రాఫ్‌తో నడుస్తుంది. ఒక్క హిట్ వంద అవకాశాలు తెస్తే, ఒక్క డిజాస్టర్ మొత్తం మార్కెట్ విలువను మార్చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖ దర్శకులు ఇటువంటి కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారు తమ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.మాస్ సినిమాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను ప్రస్తుతం డిఫెన్స్‌లో పడ్డారు. స్కంద బాక్స్ ఆఫీస్ ఫలితం అతని మార్కెట్ ఈక్వేషన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత అఖండ 2 కూడా నిరాశపరచడంతో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. దీంతో బోయపాటి తన మాస్ ఇమేజ్‌ను నమ్మి డేట్స్ ఇచ్చే స్టార్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ అంటే ఒక ఎనర్జీ, ఒక బ్రాండ్. కానీ అతని లేటెస్ట్ ఫ్లాప్స్ ట్రాక్ రికార్డును గట్టిగానే ప్రభావితం చేశాయి. ఫ్యాన్ బేస్ బాగానే ఉన్నప్పటికీ, తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే విషయంలో పటిష్టమైన కాంబినేషన్ సెట్ కాకపోవడం అతని కెరీర్ గ్రాఫ్‌ను నెమ్మదింపజేసింది.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?
ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!
టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!
సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి
విమానం ల్యాండ్ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసి..
14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన!
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

