కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్‌లో పారితోషకాల వివాదంతో నిర్మాతలు సమ్మెకు దిగారు. భారీ పారితోషకాలకు బదులు లాభాల్లో వాటా కోరుతూ మే 2 నుండి షూటింగ్‌లు నిలిపేశారు. ఈ సమ్మె సెగలు టాలీవుడ్‌కు పాకుతాయా అన్న చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్‌లో ఇప్పటికే అగ్ర హీరోలు, దర్శకులు షేరింగ్ పద్ధతిలో సినిమాలు చేస్తున్నందున, కోలీవుడ్ ప్రభావం తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)లో నిర్మాతలు, హీరోల మధ్య పారితోషకాల వివాదం తీవ్ర సమ్మెకు దారితీసింది. అధిక పారితోషకాలకు బదులు సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోలీవుడ్ నిర్మాతలు మే 2 నుండి డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను నిలిపివేశారు. ఈ సమ్మె వల్ల కోట్లలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ, అగ్ర హీరోలు ఇప్పటికీ స్పందించలేదు. నిర్మాతలు పారితోషకాల విషయంలో హీరోలను బలవంతం చేయడం లేదని, డిమాండ్‌ను బట్టే పారితోషకం తీసుకుంటున్నారనేది హీరోల వాదన. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ల నుండి నిర్మాతల వరకు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే రిస్కు తగ్గించుకునేందుకు ఈ పోరాటానికి తెరతీశారని నిర్మాతలు చెబుతున్నారు. గతంలో జానీ, బాబా వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్, రజినీకాంత్ వంటి స్టార్లు నష్టాలు భరించారు.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ అవుతున్న సారా అర్జున్ లేటెస్ట్ ఫోటో షూట్
టాలీవుడ్ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్
ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి తిరుమలలో వీఐపీ దర్శనం
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..

