నెలకు రూ. 10వేల జీతంతో రూ. 50 లక్షల ఇల్లు సొంతం చేసుకోవచ్చు.! ఇది తెలియక గిలగిల కొట్టుకుంటున్నారు..
సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కాల స్వప్నం. కానీ భారీ ఈఎంఐలు కడుతూ జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవడం కంటే, తెలివైన పెట్టుబడులతో రూ. 50 లక్షల ఇంటిని సొంతం చేసుకోవడం ఎలాగో బిజినెస్ నిపుణులు సలహలు ఇచ్చారు. చిట్స్, బంగారం కంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ ఈటీఎఫ్ (ETF)లు ఎలా మెరుగైన రాబడినిస్తాయో ఈ కథనంలో తెలుసుకోండి.

మనం సాధారణంగా ఉద్యోగంలో చేరగానే చేసే మొదటి ఆలోచన “ఒక ఇల్లు కొనేయాలి”. కానీ రూ. 10,000 నుంచి రూ. 30,000 జీతం వచ్చే యువతకు నేటి కాలంలో మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనిపై బిజినెస్ నిపుణులు చేసిన విశ్లేషణ ప్రతి ఒక్కరి కళ్లు తెరిపించేలా ఉంది. ఇంటి కోసం ఈఎంఐల ఉచ్చులో చిక్కుకోవడం కంటే, పెట్టుబడి మార్గాల ద్వారా సంపదను సృష్టించుకోవడం మేలని సూచించారు. ప్రస్తుతం ఒక చిన్న ఫ్లాట్ ధర కూడా రూ. 30-40 లక్షల పైనే ఉంది.
దీని కోసం అప్పు చేస్తే, అసలు కంటే వడ్డీనే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, ఇంటి కొనుగోలుకు 40-45 ఏళ్ల వయస్సు సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికి కెరీర్ లో స్థిరత్వం వస్తుంది. పిల్లల అవసరాలు తెలుస్తాయి. అప్పటివరకు మనం చేయాల్సింది ఏంటంటే.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి. నెలవారీ రూ. 5,000 నుంచి రూ. 10,000 పొదుపు చేయగలిగితే, దానిని పాత కాలం పద్ధతుల్లో కాకుండా ఆధునిక మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఫిజికల్ గోల్డ్ కంటే ‘గోల్డ్ ETF’లు, నేరుగా భూమి కొనలేని వారు ‘REITs'(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు) వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ఇవి చట్టబద్దంగా డబ్బు సృష్టించడమే కాకుండా, దీర్ఘకాలంలో 12-15 శాతం వార్షిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. ఇలా 15-20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, వచ్చే మెచ్యూరిటీ మొత్తంతో ఒక్క రూపాయి అప్పు లేకుండా రూ.; 50 లక్షల ఇంటిని సొంతం చేసుకోవచ్చని బిజినెస్ నిపుణులు స్పష్టం చేశారు.
