May 4, 2026
Subhash
మీకు ఐటీ నోటీసు వస్తే కంగారు పడకండి. నోటీసు రాగానే అది తప్పు చేసినట్లు కాదు. చిన్నపాటి తనిఖీ కోసం కూడా నోటీసులు వస్తుంటాయి. మొదట అది అసలైనదో కాదో తెలుసుకోవాలి.
ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. పన్ను శాఖ పేరుతో నకిలీ ఇమెయిల్‌లు, మెసేజ్‌లు పంపి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. అందుకున్న నోటీసులోని DINను వెరిఫై చేయండి.
మీ రిటర్న్స్‌లో ఏవైనా పొరపాట్లు ఉన్నా, సమాచారం సరిపోకపోయినా లేదా అదనపు పన్ను చెల్లించాల్సి ఉన్నా ఈ నోటీసు వస్తుంది. ఇమెయిల్. మీ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అందుతుంది.
సెక్షన్ 143(1): కేవలం ఇంటిమేషన్ లెటర్ సెక్షన్ 142(1): విచారణకు ముందు అదనపు పత్రాల కోసం. సెక్షన్ 143(2): మీ రిటర్న్స్‌ను నిశితంగా పరిశీలించేందుకు.
ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (incometax.gov.in) కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఎడమ వైపున ఉండే 'Quick Links' సెక్షన్‌కు వెళ్లండి.
క్విక్ లింక్స్‌లో 'Authenticate Notice/Order Issued by ITD' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ 2 విధాలుగా వెరిఫై చేయవచ్చు. నోటీసుపై ఉన్న DIN, మీ పాన్ అసెస్‌మెంట్ ఇయర్ వంటి వివరాల ద్వారా.
మీరు DIN నంబర్ మరియు మీ మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత, మీ ఫోన్‌కు ఒక OTP వస్తుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఒకవేళ ఆ నోటీసు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసినదే అయితే, వెబ్‌సైట్‌లో 'Yes, notice is valid' అని చూపిస్తుంది. అక్కడ రికార్డు లేకపోతే అది నకిలీ నోటీసు అని అర్థం.
ఆదాయాన్ని తక్కువగా చూపించడం, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు, టీడీఎస్ వివరాల్లో వ్యత్యాసం, సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వంటి కారణాలతో వస్తుంది.