రూపాయి ఖర్చు లేకుండా ఈ బిజినెస్‌లు స్టార్ట్ చేయొచ్చు.
Venkatrao Lella
Images: Pinterest
05 May 2026
మీరు పిల్లలకు ఇంట్లోనే బోధించగలిగితే, అటువంటి గృహ బోధనకు పెట్టుబడి అవసరం లేదు. ఇంట్లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు.
హోమ్ ట్యూటర్
మీకు స్టోరీ టెల్లింగ్, కంటెంట్ రాయడంలో నైపుణ్యం ఉందా.. అయితే మీరు కూడా మీ స్వంత వెబ్‌సైట్‌ను ప్రారంభించవచ్చు. దీని ద్వారా ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించవచ్చు
కంటెంట్ రైటర్
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ లేదా సర్వీసులు అందించడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. ఇందుకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు. అంతేకాకుండా మీకు ఆదాయం కూడా పెద్ద మొత్తం వస్తుంది
రియల్ ఎస్టేట్
అంతేకాక మీరు సంగీతంలో నిపుణులైతే ఇంట్లోనే కీబోర్డ్, గిటార్ మొదలైనవి నేర్పించవచ్చు. దీని ద్వారా ఇంటి వద్దే ఉండి మీరు భారీగా ఆదాయం పొందే అవకాశముంది
మ్యూజిక్ టీచర్
ఇతర వెబ్‌సైట్‌ల కోసం ఫ్రీలాన్స్ రైటర్‌గా కూడా పని చేయవచ్చు. దీనికి కూడా మీకు డబ్బు చెల్లిస్తారు. కంటెంట్ రాయడంలో మీకు అనుభవం ఉంటే ఈ పని చేయవచ్చు
ఫ్రీలాన్స్ రైటర్
బీమా సంబంధిత సేవలకు కూడా ఎలాంటి పెట్టుబడులు అవసరం లేదు. మీకు మార్కెటింగ్ అనుభవం దీని ద్వారా ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించవచ్చు
బీమా
ఇక అప్రిషియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎలాంటి ఖర్చు లేకుండా డబ్బులు సంపాదించవచ్చు. ఆన్‌లైన్‌లోని ప్రొడక్ట్స్‌ను మీరు షేర్ చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. దీనికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు
అప్రిషియేట్ మార్కెటింగ్
ఇక వేరే ఈ-కామర్స్ వెబ్‌సైట్లోని ప్రొడక్ట్స్‌ను మీ సైట్ ద్వారా రీసెల్లింగ్ చేయడాన్ని డ్రాఫ్ షిప్పింగ్ అంటారు. దీనికి కూడా ఎలాంటి ఖర్చు అవ్వదు. సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు