AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 15: మార్కెట్‌లోకి యాపిల్‌ ఐ ఫోన్‌ 15.. మతిపోగొట్టేలా నయా ఫీచర్స్‌.. లాంచింగ్‌ అప్పుడే అంట..!

యాపిల్‌ ఫోన్‌ ఉండడమే ఓ హోదాగా ఫీలవుతూ ఉంటారు. కస్టమర్ల నుంచి వచ్చే అనూహ్య స్పందనకు అనుగుణంగా యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త సిరీస్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా తన సిరీస్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఐ ఫోన్‌ 15 ఫోన్‌ రిలీజ్‌ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్‌ ఐ ఫోన్‌ 15 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12న, కానీ సెప్టెంబర్ 13న ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Apple iPhone 15: మార్కెట్‌లోకి యాపిల్‌ ఐ ఫోన్‌ 15.. మతిపోగొట్టేలా నయా ఫీచర్స్‌.. లాంచింగ్‌ అప్పుడే అంట..!
I Phone 15
Nikhil
|

Updated on: Aug 08, 2023 | 8:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఫోన్లకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తూ అధునాతన స్పెసిఫికేషన్స్‌తో వచ్చే యాపిల్‌ ఫోన్స్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. ధర అధికంగా ఉన్నా యాపిల్‌ ఫోన్స్‌ను కొంటూ ఉంటారు. యాపిల్‌ ఫోన్‌ ఉండడమే ఓ హోదాగా ఫీలవుతూ ఉంటారు. కస్టమర్ల నుంచి వచ్చే అనూహ్య స్పందనకు అనుగుణంగా యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త సిరీస్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా తన సిరీస్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఐ ఫోన్‌ 15 ఫోన్‌ రిలీజ్‌ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్‌ ఐ ఫోన్‌ 15 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12న, కానీ సెప్టెంబర్ 13న ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఐఫోన్‌లు సెప్టెంబర్ 15న ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 22న విక్రయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఇప్పటికే లాంచ్‌ ఈవెంట్‌ కోసమే అన్నట్లుగానే యాపిల్‌ తన ఉద్యోగులకు సెప్టెంబర్‌ 13న సెలవు తీసుకోవద్దని కోరింది. సాధారణంగా యాపిల్‌ ఈవెంట్ తేదీకి ఒక వారం ముందు మీడియాకు ఆహ్వానాలను పంపుతుంది. ఐఫోన్‌ 15 లైనప్‌తో పాటు యాపిల్‌వాచ్‌ సిరీస్‌ 9, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2 మోడల్స్‌ను లాంచ్‌ చేసే అవకాశంది. 

యాపిల్‌ ఐ ఫోన్‌ 15 ధర

యాపిల్‌ ఐ ఫోన్‌ 15 సిరీస్‌లో 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు – ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌. అయితే ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే అధిక ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆసియాలోని సప్లై చైన్ కంపెనీలతో జరిపిన సంభాషణల ఆధారంగా యాపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌లు ప్రస్తుత వాటి కంటే ఖరీదైనవిగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్‌ 14తో పోలిస్తే ఐ ఫోన్‌ 15 ధర దాదాపు వంద డాలర్ల ఎక్కు ఉంటుంది. ఐ ఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఐ ఫోన్‌ 14ల ప్రో మ్యాక్స్‌ కంటే 100 నుంచి 200 డాలర్ల ధర ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఐ ఫోన్‌ 15, ఐ ఫోన్‌ 15 ప్లస్‌ ధర 799 డాలర్ల నుంచి 899 డాలర్లు ఉంటే అవకాశం ఉంది. ఐ ఫోన్‌ 15 ప్రో ధర 1,099 డాలర్ల వరకూ ఉండవచ్చు. అలాగే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ధర 1,299 డాలర్ల వరకూ ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐ ఫోన్‌ 15 ఫీచర్లు

ఐఫోన్‌ 14 మోడల్స్‌తో 3ఎక్స్‌తో పోల్చితే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో పెరిస్కోప్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేయబడిన టెలిఫోటో లెన్స్‌ను బ్లర్ లేకుండా 5-6 ఎక్స్‌ వరకు జూమ్ చేయవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. ప్రో మోడల్‌లు టైప్‌ సీ పోర్ట్, టైటానియం ఫ్రేమ్, అనుకూలీకరించదగిన యాక్షన్ బటన్, వేగవంతమైన ఏ 17 బయోనిక్ చిప్, సన్నని డిస్‌ప్లే బెజెల్స్, వైఫై 6సీ సపోర్ట్, ర్యామ్‌ను కూడా అప్‌గ్రేడ్‌ చేసినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్ అందరినీ ఆకర్షిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నాయి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..