Croma Apple Days: యాపిల్ సేల్స్ డేస్ షురూ… టాప్ 5 డీల్స్ ఇవే..!
యాపిల్ కొత్త సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో అన్ని యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఐఫోన్ 14, లేటెస్ట్‌గా రిలీజైన మ్యాక్ బుక్ వరకూ అన్ని ఉత్పత్తులు ఈ సేల్‌లో వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ వేరు. సెక్యూరిటీపరంగా యాపిల్ అందించే ఫీచర్లు వేరే ఏ కంపెనీ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు ఎక్కువగా యాపిల్ ఉత్పత్తులంటే మోజు పడుతుంటారు. అయితే ధరపరంగా చూస్తే మాత్రం ఇవి సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో ఉండవు. అయితే యాపిల్ ఉత్పత్తులంటే ఇష్టపడే చాలా మంది ప్రత్యేక సేల్స్ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. ఆయా సేల్స్ తమకు నచ్చిన యాపిల్ ఉత్పత్తి తక్కువ ధరకు వస్తే కొనుగోలు చేస్తూ ఉంటారు. గత వారం భారతదేశంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు సమ్మర్ సేల్స్ నడిపాయి. అయితే ఆ సేల్స్‌లో యాపిల్ ఉత్పత్తులపై అనుకున్నంత డిస్కౌంట్స్ ప్రకటించలేదు. అయితే ఆ సమయంలో యాపిల్ భవిష్యత్‌లో మరో సేల్‌లో తమ ఉత్పత్తులపై తగ్గింపునిస్తుందని చాలా మంది టెక్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలను నిజం చేస్తూ యాపిల్ కొత్త సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో అన్ని యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఐఫోన్ 14, లేటెస్ట్‌గా రిలీజైన మ్యాక్ బుక్ వరకూ అన్ని ఉత్పత్తులు ఈ సేల్‌లో వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టాప్-5 డీల్స్‌పై ఓ లుక్కేద్దాం.
ఐఫోన్ 14
ఐఫోన్ 14 బేస్ మోడల్‌పై ఈ సేల్‌లో రూ.70,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది 6.1 అంగుళాల డిస్‌ప్లేతో ఏ15 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ ఐఫోన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే కొనుగోలుదారులు బ్యాంకు డిస్కౌంట్ల ద్వారా మరో రూ.4000 తగ్గింపును పొందుతారు.
యాపిల్ మ్యాక్ బుక్ ప్రో 2022
13.3 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఈ యాపిల్ మ్యాక్ బుక్ ప్రో ఎం2 చిప్‌సెట్‌తో 8 జీబీ+ 512 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మ్యాక్ బుక్ ప్రోపై 9.2 శాతం తగ్గింపుతో రూ.1,32,990కు అందుబాటులో ఉంది. అలాగే కొనుగోలుదారుడు బ్యాంకు కార్డుల ద్వారా రూ.5000 తగ్గింపును పొందే అవకాశం ఉంది.
యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్
13.3 అంగుళాలతో స్క్రీన్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఎం1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ 19 శాతం తగ్గింపుతో రూ.80,990 వద్ద అందుబాటులో ఉంది. అలాగే బ్యాంకు కార్డుల ద్వారా మరో రూ.5000 తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ వాచ్ ఎస్ఈ జీపీఎస్
1.57 అంగుళాల రెటీనా ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ వాచ్ 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ8 పేరుతో వచ్చే ఈ వాచ్ 8 శాతం పైగా తగ్గింపుతో రూ.27,342కు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ క్యాష్ బ్యాక్ ద్వారా అదనంగా రూ.2000 తగ్గింపు లభిస్తుంది.
యాపిల్ ఐ ప్యాడ్ 9 జెన్
ఈ ట్యాబ్లెట్ 10.2 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఏ 13 బయోనిక్ 64 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ట్యాబ్ ఈ సేల్‌లో రూ.30,282కు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ కార్డుల ద్వారా రూ.2000 అతనపు తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..