Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Employees: యాపిల్ టెక్ దిగ్గజ ఉద్యోగుల వేతనం ఎంతో తెలిస్తే షాక్.. ఒక్కొక్కరి సాలరీ ఎంతంటే..?

మనలో చాలా మందికి వివిధ కంపెనీలు ఇచ్చే జీతాలు ఎలా ఉంటాయి? అని ఆరా తీయడం అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత టెక్ కంపెనీల్లో పనిచేసే వారి వేతనాలు భారీగా ఉంటాయని తెలిసిన విషయమే.

Apple Employees: యాపిల్ టెక్ దిగ్గజ ఉద్యోగుల వేతనం ఎంతో తెలిస్తే షాక్.. ఒక్కొక్కరి సాలరీ ఎంతంటే..?
Apple Employees
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2021 | 7:29 PM

Apple Employees Salaries: మనలో చాలా మందికి వివిధ కంపెనీలు ఇచ్చే జీతాలు ఎలా ఉంటాయి? అని ఆరా తీయడం అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత టెక్ కంపెనీల్లో పనిచేసే వారి వేతనాలు భారీగా ఉంటాయని తెలిసిన విషయమే. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించి, వారి ఆకాంక్షలను నేరవేర్చుతుంటాయి. యాపిల్ (Apple), గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon)వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసే వారి జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉత్సుకత ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్‌’ (Apple)లో ఇంజినీర్లు, డిజైనర్లుగా పనిచేసే వారు ఏ మాత్రం సంపాదిస్తారో తెలుసా..? ఇందుకు సంబంధించి ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ వెబ్‌సైట్‌ ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ సంస్థ సర్వే నిర్వహించి ఓ నివేదిక సిద్ధం చేసింది.

ట్రెండ్‌కి తగ్గట్టు కొత్త మార్పులతో ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌ (Macs) ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎన్నో కసరత్తులు చేసే అక్కడి డిజైనర్లు, ఇంజినీర్ల జీతం ఏమాత్రం ఉంటుందనేది ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ వెబ్‌సైట్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌కు యాపిల్‌ కంపెనీ తెలియజేసిన వేతన వివరాలు ఆధారంగా ఈ లెక్కల్ని సేకరించింది. ఈ నివేదికలో ఆ సంస్థలోని ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు అందుతున్న సగటు వేతనం వివరాలను తెలియజేసింది. కాలిఫోర్నియాలోని ఒక ఇంజనీర్‌ అత్యధిక వేతనం నెట్ 3,50,000 డాలర్లు (సుమారు రూ. 2.6 కోట్లు) తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. అత్యల్ప సగటు జీతం 1,06,500 డాలర్లు (దాదాపు రూ. 79.6 లక్షలు) ఉన్నట్టు తెలిపింది. అమెరికా కంపెనీలు వీసాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు విదేశాల నుంచి వచ్చే కార్మికులకు ఎంత జీతం ఇవ్వాలనుకుంటున్నారో వెల్లడించాలని నివేదిక పేర్కొంది. సుమారు 1,000 యాపిల్ వర్క్ వీసాలపై మూడో త్రైమాసికంలో వెల్లడించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ఈ వేతనాలు అమెరికాకు సంబంధించినవి మాత్రమే.

హోదా పరంగా జీతం ఏడాదికి ఇలా..

@ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి 1,28,200- 2,20,000 డాలర్లు (సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1.63 కోట్లు) @సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్లు 2,39,871 డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) @మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు) @టెస్టింగ్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 137,275 డాలర్లు (సుమారు రూ.1.02 కోట్లు) @ ప్రొడక్షన్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.11 కోట్లు) @సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 1,25,000 డాలర్లు (సుమారు రూ.93లక్షలు) @ మెషిన్‌ లెర్నింగ్‌ రీసెర్చ్‌ ఇంజినీర్‌ 2,11,300 డాలర్లు (సుమారు రూ. 1.57 కోట్లు)

Read Also… Indian Women: భారత మహిళలు ప్రపంచంలోనే అత్యంత ఆత్మవిశ్వాసం గలవారు.. అధ్యయనంలో వెల్లడి!