Nirmala Sitharaman: బ్యాంకు ఎగవేతదారులపై కఠినచర్యలు.. ఎగ్గొట్టిన ప్రతి పైసా వసూలు చేస్తాంః నిర్మలా సీతారామన్
బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణాల ఎగవేతదారుల నుండి ప్రతి పైసాను రికవరీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం స్పష్టం చేశారు.
FM Nirmala Sitharaman on Loan Defaulters: బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణాల ఎగవేతదారుల నుండి ప్రతి పైసాను రికవరీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం స్పష్టం చేశారు. భారత్ దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రుణాల చెల్లించేంత వరకు వదిలి పెట్టే సమస్యలేదన్నారు. ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులన్నీ వెనక్కి తెప్పిస్తామని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ మాత్రమే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకం ప్రయోజనాలు.. కేంద్ర పాలిత ప్రాంత లబ్ధిదారులకు చేరేలా చూస్తామని మంత్రి తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తోందని సీతారామన్ చెప్పారు. జమ్మూలో అభివృద్ధి వేగంగా.. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉండేలా చూడడమే మోడీ సర్కార్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఆర్థిక సమ్మేళనం, సులువుగా రుణాలు పొందే కార్యక్రమం కింద లబ్ధిదారులకు సంబంధించిన ఉత్తర్వులను మంత్రి నిర్మలా సీతారామన్ అందజేశారు. జమ్మూ కాశ్మీర్‌లో వివిధ పనులను పారదర్శకంగా వేగవంతం చేయడానికి ప్రభుత్వం తన వనరులన్నింటినీ ఖర్చు పెడుతుందని సీతారామన్ అన్నారు. బ్యాంకుల్లో అవకతవకలు జరిగినా, తీసుకున్న రుణాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల వల్ల ఆర్ధిక వ్యవస్థ విచ్చిన్నమవుతోందన్నారు. బ్యాంకు రుణాల ఎగ్గొట్టే వారెవరిని వదిలిపెట్టేదీలేదన్న ఆమె.. ఆ మొత్తాన్ని వెనక్కి తెస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఇదే జరుగుతోందని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా తిరిగి చెల్లించని వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఆ డిఫాల్టర్లు భారతదేశంలో ఉన్నా లేదా దేశం వెలుపల ఉన్నా, వారిపై కేసు కొనసాగుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. NPAలను తగ్గించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించామన్నారు. దేశవ్యాప్తంగా మొండి బకాయిలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, బ్యాంకుల్లో మూలధనాన్ని నింపడం, బ్యాంకుల్లో సంస్కరణలను కొనసాగించడం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇది సానుకూల ఫలితాలను కూడా తెచ్చిపెట్టిందని మంత్రి వివరించారు.
బ్యాంకుల నుంచి తిరిగి రాని ప్రతి పైసా తిరిగి వచ్చేలా ప్రభుత్వం చూస్తోందని సీతారామన్ చెప్పారు. ఇందు కోసం,డిఫాల్టర్ల ఆస్తులు అటాచ్ చేయడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ కింద విక్రయించడం లేదా వేలం వేయడం జరుగుతుందన్నారు. దీంతో వచ్చిన సొమ్మును బ్యాంకులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. జమ్మూ మరియు కాశ్మీర్‌లో వేగవంతమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన అభివృద్ధి కోసం కృషీ చేస్తున్న యూనియన్ టెరిటరీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కేంద్ర ఆర్థిక మంత్రి అభినందించారు.
"Projects that have been waiting a long time are getting rapidly implemented, sections of society that have never had any assistance from govt are getting it & genuine businesses are also being provided credit."
– Smt @nsitharaman during the banking outreach programme in Jammu https://t.co/aWrDphxFkj pic.twitter.com/WgloCO1smO
— NSitharamanOffice (@nsitharamanoffc) November 23, 2021