AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorists: మళ్ళీ క్రియాశీలకంగా మారిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా..ఆప్ఘన్.. పాక్ లలో కొత్త శిబిరాలు..

ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మరోసారి క్రియాశీలకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఉగ్రవాద సంస్థ మళ్ళీ జవసత్వాలు నింపుకుని నిలబడుతోంది.

Terrorists: మళ్ళీ క్రియాశీలకంగా మారిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా..ఆప్ఘన్.. పాక్ లలో కొత్త శిబిరాలు..
Terrorists In Afghanistan And Pakistan
Follow us
KVD Varma

|

Updated on: Nov 23, 2021 | 6:59 PM

Terrorists: ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మరోసారి క్రియాశీలకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఉగ్రవాద సంస్థ మళ్ళీ జవసత్వాలు నింపుకుని నిలబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ మీడియా ప్రకారం, లష్కర్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలో కొత్త ఉగ్రవాద శిబిరాలను సిద్ధం చేసింది. వీటిలో వందలాది మంది ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు. ఈ పనిలో హక్కానీ నెట్‌వర్క్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ (ఐఎస్‌ఐఎస్-కె) నుంచి లష్కర్‌కు సహాయం కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్

డైలీ సిక్కు వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ లష్కర్ నుండి పెరుగుతున్న ముప్పుపై వార్తా సంస్థ నివేదించింది. దీని ప్రకారం, లష్కరే ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అనేక కొత్త ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసింది. హక్కానీ నెట్‌వర్క్‌, ఐఎస్‌ఐఎస్‌-కె వంటి ఉగ్రవాద సంస్థలు దానికి సహాయం చేస్తున్నాయని భావిస్తున్నారు. 160 మంది మరణించిన 2008 ముంబై దాడులకు పాల్పడింది లష్కరే. చనిపోయిన వారిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. దీని తరువాత, ఈ ఉగ్రవాద సంస్థ, దాని నాయకుడు హఫీజ్ సయీద్‌పై చర్య తీసుకోవాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగింది. హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉన్నాడు.

తాలిబాన్ ప్రభుత్వానికి సహాయం చేస్తుంది

మీడియా నివేదిక ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆఫ్ఘన్ తాలిబాన్ పోరాట ఆక్రమణకు లష్కరే తోయిబా సహాయం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో హక్కానీ నెట్‌వర్క్‌తో దీనికి సాన్నిహిత్యం పెరిగింది. అయితే షరియా చట్టాన్ని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ తాలిబన్లు పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడుతుండగా, పాకిస్థాన్ తాలిబాన్, లష్కర్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా తెలియడం లేదు. మీదయా కథనం ప్రకారం, లష్కర్ తన గ్రూప్‌లో రిక్రూట్‌మెంట్ కోసం పాకిస్తాన్-ఆఫ్ఘన్ సరిహద్దులోని మదర్సాలపై ఆధారపడి ఉంది. రిక్రూట్ అయిన యోధులను ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, నంగర్‌హార్ ప్రావిన్సులలో శిక్షణా శిబిరాలకు పంపిస్తారు.

ప్రపంచం దృష్టిలో దుమ్ము రేపిన ముంబై దాడుల తర్వాత లష్కరే తోయిబాపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ముంబయి పేలుళ్లతో లష్కరే తోయిబాకు ఉన్న సంబధాలను బహిర్గత పరిచినా.. ఫలితం లేకపోయింది. లష్కరే పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం, ప్రఖ్యాత గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సహకరిస్తుండటమే ఇందుకు కారణం. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆక్రమించిన తర్వాత కొన్ని ఉగ్రవాద సంస్థలు అక్కడ మళ్లీ కలుస్తున్నాయని కొద్ది రోజుల క్రితం కూడా ఒక నివేదిక పేర్కొంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ భూమిని మరే ఇతర దేశంపై దాడులకు ఉపయోగించలేమని తాలిబాన్ పాలన పదేపదే పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి