AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse: ఖగోళంలో మరో వారంలో అద్భుతం.. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి రంగు మార్పు..!

భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది చంద్రునిపై నీడను వేస్తుంది. అయితే దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు సమలేఖనంలో ఉన్నప్పుడు పౌర్ణమి సమయంలో మాత్రమే జరుగుతుంది. భూమి సూర్యరశ్మిని చంద్రునికి చేరకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల అది ఎరుపు-గోధుమ లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.

Lunar Eclipse: ఖగోళంలో మరో వారంలో అద్భుతం.. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి రంగు మార్పు..!
Lunar Eclipse
Nikhil
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 22, 2023 | 8:20 PM

Share

మానవులు భూమి నుంచి వీక్షించగలిగే ఖగోళ అద్భుతాలు ఏమైనా ఉన్నాయంటే అవి గ్రహణాలు మాత్రమే. భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది చంద్రునిపై నీడను వేస్తుంది. అయితే దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు సమలేఖనంలో ఉన్నప్పుడు పౌర్ణమి సమయంలో మాత్రమే జరుగుతుంది. భూమి సూర్యరశ్మిని చంద్రునికి చేరకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల అది ఎరుపు-గోధుమ లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. ఈ నెల ప్రారంభంలో వచ్చిన సూర్యగ్రహణాన్ని చూసి చాలా మంది స్కైవాచర్‌లు ఆనందించారు. అయితే మరో వారం రోజుల్లో ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం కోసం ఆత్రుతగా ఎదురుగు చూస్తున్నారు. ఈ ఏడాది మే 5న ఏర్పడిన చంద్రగ్రహణం తర్వాత మరోసారి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది కేవలం పాక్షిక చంద్ర గ్రహణం మాత్రమే. ఈ చంద్రగ్రహణం గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

చంద్ర గ్రహణాలు వేల సంవత్సరాలుగా మానవులకు ఖగోళ అద్భుతంగా నిలుస్తున్నాయి. అయితే అనేక సంస్కృతుల్లో చంద్ర గ్రహణాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ముడిపడి ఉన్నాయి. ఆధునిక కాలంలో , భూమి-చంద్ర వ్యవస్థ, చంద్రుని ఉపరితలంపై భూమికి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన ప్రభావాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు గ్రహణాలు బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చంద్రగ్రహణాలను మూడు రకాలుగా విభజించారు. సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షిక చంద్ర గ్రహణం, పెనుంబ్రల్ చంద్ర గ్రహణం. ఈ అక్టోబర్‌ 28న చంద్రుడు పాక్షికంగా భూమికి సంబంధించిన నీడ మీదుగా వెళ్తున్నప్పుడు ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో చంద్రుడు ఎరుపు-గోధుమ రంగులోకి మారతాడు. అయితే ఈ చంద్రగ్రహణ సమయం గురించి తెలుసుకుందాం.

చంద్రగ్రహణం సమయం ఇలా

భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 28, 2023న రాత్రి 11గంటల 31 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది. ఈ గ్రహణం అక్టోబర్‌ 29న ఉదయం మూడు గంటల 36 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణాన్ని అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్యలో వీక్షించవచ్చు. ఆసియా, రష్యా, ఆఫ్రికా, అమెరికా, యూరప్, అంటార్కిటికాతో సహా చంద్రుడు హోరిజోన్‌కు ఎగువన ఉన్న చోట నుంచి ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. గ్రహణం సమయంలో చంద్రుడు హోరిజోన్ నుంచి 62 డిగ్రీల ఎత్తులో ఉంటాడు. భారతదేశంలో గరిష్ట గ్రహణం ఉదయం 1:45 గంటలకు సంభవిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి