Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెల 28 వెంకన్న ఆలయం 8 గంటలు మూసివేత.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పనుండి. కనుక ముందు రోజు అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు స్వామివారి అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సంవత్సరంలో రెండవది.. చివరిదైన చంద్రగ్రహణం ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. మన దేశంలో కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం చూపనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి గ్రహణ సమయాన్ని సూతక కాలంగా హిందువులు భావిస్తారు. ఈ సమయంలో పనులు చేయడం పాపంగా భావిస్తారు. పూజ గదిని కూడా మూసివేస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29 తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని దాదాపు 8 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. అక్టోబర్ 28 రాత్రి శ్రీవారి ఆలయాన్ని మూసివేసి.. సంప్రోక్షణ అనంతరం తిరిగి అక్టోబర్ 29న ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు.
ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పనుండి. కనుక ముందు రోజు అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు స్వామివారి అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ఆలయ ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. అంటే చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి తెల్లవారు జామున వరకూ దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో శీవారి సహస్ర దీపాలంకార సేవ తో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనాలను అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను.. తదనుగుణంగా తిరుపతి యాత్రను ప్లాం చేసుకోల్సిందా కోరుతున్నారు టీటీడీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..