Vastu Tips for Home: ఇంట్లో మెయిన్ స్విచ్ ఏర్పాటుకు వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఈ దిశలో పెడితే ఇంటి యజమానికి అన్నీ కష్టాలే..

కరెంటు లేకపోతే ఇంట్లోని ఎలక్రికల్ వస్తువులు పనిచేయవు. ప్రస్తుతం కరెంటు లేకుండా నీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. ప్రధాన స్విచ్ విద్యుత్ పంపిణీని, అన్ని ప్రదేశాలకు విద్యుత్ ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది. మెయిన్ స్విచ్ నుండి, MCB ద్వారా వివిధ భాగాలకు విద్యుత్తును అందించవచ్చు. లేదా  ఆఫ్ చేయవచ్చు. కనుక ఈ మెయిన్ స్విచ్ అనేది అగ్ని మూలక చిహ్నంగా భావిస్తారు.

Vastu Tips for Home: ఇంట్లో మెయిన్ స్విచ్ ఏర్పాటుకు వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఈ దిశలో పెడితే ఇంటి యజమానికి అన్నీ కష్టాలే..
Vastu Tips For Home
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 7:43 AM

వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువుల ఏర్పాటుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారం అమర్చినట్లయితే.. ఇంట్లో శ్రేయస్సు నెలకొంటుంది. ఇంట్లో విద్యుత్ ని అందించేందుకు లేదా కంట్రోల్ చేసేందుకు మెయిన్ స్విచ్ ను ఏర్పాటు చేస్తారు. అందువల్ల ఇది ఇంటి ప్రధాన ఉపకరణాల్లో లెక్కించబడుతుంది. అటువంటి పరిస్థితిలో వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం. ఒకవేళ వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్‌ ఏర్పాటు చేయకుండా నచ్చిన చోటు పెట్టుకోవడం వలన ఇంట్లోని అనేక రకాల సమస్యలు ఏర్పడవచ్చు. కనుక వాస్తు ప్రకారం మెయిన్ స్విచ్ ను ఏర్పాటు చేసుకుంటే.. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీటర్, మెయిన్ స్విచ్

చాలా మందికి విద్యుత్ మెయిన్ స్విచ్, మీటర్ గురించి ఏర్పాటు చేసుకోవడం విషయంలో గందరగోళం ఉంటుంది. మీటర్‌ను మెయిన్ స్విచ్‌గా పరిగణించి అక్కడ నుండి విద్యుత్ సరఫరా అవుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే  మీటర్, మెయిన్ స్విచ్ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీటర్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట స్థలంలో మాత్రమే ప్రభుత్వ అధికారులు అమరుస్తారు. ఈ మీటర్ మీరు వినియోగించే విద్యుత్‌ను మాత్రమే ట్రాక్ చేస్తుంది. వాస్తు దృక్కోణంలో దీనికి ప్రాముఖ్యత లేదు. మీటర్ నుండి విద్యుత్తు నేరుగా మెయిన్ స్విచ్‌కి వెళ్లి అక్కడి నుండి పంపిణీ చేయబడుతుంది, అందుకే మెయిన్ స్విచ్ చాలా ముఖ్యంగా పరిగణిస్తారు.

అగ్ని మూలక చిహ్నం

పని చేసి అలసిపోయిన తర్వాత చాలామంది తమలో ఇంక కరెంట్ లేదని అంటే శక్తి లేదని అని తరచుగా అంటూ వింటూనే ఉంటారు. అదేవిధంగా ఇంట్లోని అన్ని ఉపకరణాలు శక్తితో అంటే విద్యుత్తుతో నడుస్తాయి. కరెంటు లేకపోతే ఇంట్లోని ఎలక్రికల్ వస్తువులు పనిచేయవు. ప్రస్తుతం కరెంటు లేకుండా నీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. ప్రధాన స్విచ్ విద్యుత్ పంపిణీని, అన్ని ప్రదేశాలకు విద్యుత్ ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది. మెయిన్ స్విచ్ నుండి, MCB ద్వారా వివిధ భాగాలకు విద్యుత్తును అందించవచ్చు. లేదా  ఆఫ్ చేయవచ్చు. కనుక ఈ మెయిన్ స్విచ్ అనేది అగ్ని మూలక చిహ్నంగా భావిస్తారు. మెయిన్ స్విచ్ ను కూడా వాస్తు నియమాలకు లోబడి సరైన స్థలంలో ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

కొందరు వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటారు. అయితే మెయిన్ ఎలక్ట్రిక్ స్విచ్ ను ఎక్కడ వీలయితే అక్కడ ఏర్పాటు చేస్తే.. ఇంటి మొత్తాన్ని ప్రకాశాన్ని అందించే విద్యుత్ హాని కలిగిస్తుంది. ఈ మెయిన్ స్విచ్ నైరుతిలో ఉన్నట్లయితే రాహువు, కుజుడు సంయోగంతో అంగారక యోగం ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఇంటి  యజమాని ఆరోగ్యానికి మంచిది కాదు. అదే సమయంలో మెయిన్ స్విచ్ ఈశాన్య మూలలో పెడితే భవన యజమాని మెదడు విద్యుదాఘాతానికి గురైనట్లే. ఈశాన్య దిశలో నీరు ఉంటుంది. కనుక నీటికి..విద్యుత్ కు ఉండే బంధం అందరికి తెలిసిందే కనుక.. అప్పుడు ఫలితం ఏమిటో అందరికీ బాగా తెలుసు.  కనుక మెయిన్ స్విచ్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం ఆగ్నేయ మూల అంటే తూర్పు .. దక్షిణ దిక్కుల మధ్య ఏర్పాటు చేయడం అత్యుత్తమం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్తున్నారా.. జాగ్రత్త సుమా..
శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్తున్నారా.. జాగ్రత్త సుమా..
మీ డేటా కూడా ప్రమాదంలో ఉందా? ఆన్‌లైన్ మోసాల పట్ల గూగుల్ ట్రిక్స్
మీ డేటా కూడా ప్రమాదంలో ఉందా? ఆన్‌లైన్ మోసాల పట్ల గూగుల్ ట్రిక్స్
అల్లు అర్జున్ వీడియో పై రేవంత్ రెడ్డి రియాక్షన్..
అల్లు అర్జున్ వీడియో పై రేవంత్ రెడ్డి రియాక్షన్..
గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..
గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..
పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు..
పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు..
ఈ రోజు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేస్తే.. శుభప్రదం అంటే..
ఈ రోజు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేస్తే.. శుభప్రదం అంటే..
షేర్లను బహుమతిగా ఇవ్వడంపై ఎంత పన్ను విధిస్తారు? నిబంధనలు ఏంటి?
షేర్లను బహుమతిగా ఇవ్వడంపై ఎంత పన్ను విధిస్తారు? నిబంధనలు ఏంటి?
ఇంట్లోని సమస్యలా.. ఉపశమనం కోసం శనివారం ఈ నివారణలు చేసి చూడండి..
ఇంట్లోని సమస్యలా.. ఉపశమనం కోసం శనివారం ఈ నివారణలు చేసి చూడండి..
తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలు
తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలు
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు..
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు..
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..