Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: దంపతుల మధ్య కలతలా, సంతానలేమా.. నల్ల బియ్యంతో శనివారం ఈ నివారణ చర్యలు చేసి చూడండి..

బియ్యం  పవిత్రమైనవిగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించబడుతుంది. భగవంతుని ఆరాధనతో సహా ఏదైనా శుభకార్యానికి బియ్యాన్ని ఉపయోగిస్తారు. అయితే  చాలా కొద్ది మందికి మాత్రమే వైట్ రైస్ కాకుండా బ్లాక్ రైస్ ఉపయోగించి కొన్ని నివారణ చర్యలు చెయ్యవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇలా నల్లబియ్యం తో చేసే నివారణ చర్యలతో జీవితంలో సుఖ శాంతులను, సిరి సంపదలను పొందవచ్చు.

Astro Tips: దంపతుల మధ్య కలతలా, సంతానలేమా.. నల్ల బియ్యంతో శనివారం ఈ నివారణ చర్యలు చేసి చూడండి..
Black Rice Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2023 | 9:37 AM

హిందూ పూజల్లో ఉపయోగించే ద్రవ్యాల్లో అక్షతలకు ప్రముఖ స్థానం ఉంది. బియ్యం, పసుపు నెయ్యి కలిపి తయారు చేసే అక్షతలను దేవుళ్లను పూజించడానికి మాత్రమే కాదు.. పెద్దల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో కూడా ఉపయోగిస్తారు. ఇలా చేయడం శుభప్రదం అని నమ్మకం. అదే విధంగా పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన సమయంలో బియ్యం ముందుగా పోస్తారు. ఇలా బియ్యం లేకుండా ఎటువంటి కార్యక్రమం పని జరగదని చెప్పవచ్చు. ఇందులో తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

బియ్యంలో వివిధ రకాలు ఉన్నాయి. బియ్యాన్ని వంటకాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా పూజలో కూడా బియ్యాన్ని ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో నాల్గవ స్థానం అక్షతలది అంటారు. బియ్యం  పవిత్రమైనవిగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించబడుతుంది. భగవంతుని ఆరాధనతో సహా ఏదైనా శుభకార్యానికి బియ్యాన్ని ఉపయోగిస్తారు.

అయితే  చాలా కొద్ది మందికి మాత్రమే వైట్ రైస్ కాకుండా బ్లాక్ రైస్ ఉపయోగించి కొన్ని నివారణ చర్యలు చెయ్యవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇలా నల్లబియ్యం తో చేసే నివారణ చర్యలతో జీవితంలో సుఖ శాంతులను, సిరి సంపదలను పొందవచ్చు. ఈ రోజు మనం జీవితంలోని సమస్యలను దూరం చేసే బ్లాక్ రైస్ చిట్కాలను గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

బ్లాక్ రైస్ తో రెమెడీస్

  1. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరియాలంటే నల్ల బియ్యాన్ని తెల్లటి గుడ్డలో కట్టి కాళీమాత పాదాల చెంత సోమవారం నాడు సమర్పించండి. అనంతరం ఆ బియ్యాన్ని ఎవరికైనా దానము ఇవ్వండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.
  2. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించాలన్నా..  లేదా కొత్త ఉద్యోగం పొందడంలో సమస్యలు ఎదురవుతున్నా శనివారం రోజు శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి ఆవాల నూనె కలిపిన నల్ల బియ్యాన్ని సమర్పించండి. అనంతరం శని మంత్రాన్ని జపించండి.
  3. వైవాహిక జీవితంలో సంతోషం, సంతానం కోరుకుంటే రావి చెట్టుకి నీరు సమర్పించి.. నల్ల బియ్యం నైవేద్యంగా పెట్టండి. అంతే కాకుండా శనివారం నల్లబియ్యాన్ని నూనెతో కలిపి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంతానం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
  4. ఏదైనా పని  చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంటే.. ఇంటి పూజ గదిలో ఎగురుతున్న హనుమంతుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. నల్ల బియ్యంతో పీఠాన్ని ఏర్పాటు చేసి హనుమంతుని చిత్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల చేపట్టిన పనిలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జరుగుతుంది.
  5. ఇంట్లో ఎవరైనా చాలా రోజులుగా అనారోగ్యంతో ఉంటే, పాలు,నల్ల బియ్యం నీటిలో కలిపి సోమవారం శివలింగానికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే వ్యాధి నుంచి బయటపడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)