Guru Rahu Yuti: అక్టోబర్ 30న ముగియనున్న గురు-రాహువుల కలయిక.. ఈమూడు రాశుల వారికి మంచి రోజులు మొదలు..
మేషరాశిలో తన ప్రయాణాన్ని ముగించిన తర్వాత రాహువు మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ మార్పు మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులపై శుభ, అశుభ ప్రభావాలను చూపించనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30 తర్వాత మూడు రాశుల వారు లాభం పొందబోతున్నారు. ఈ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పయనిస్తుంది. గ్రహాలు రాశిని మార్చుకునే సమయంలో కొన్ని సంయోగాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి రెండు ఆధిపత్య గ్రహాలు సంయోగం ఏర్పడినప్పుడు లేదా మహా దశ ముగిసినప్పుడు.. ఈ ప్రభావం ప్రతి రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, వృత్తి , ఉద్యోగ, వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రస్తుత గ్రహ స్థానాల ప్రకారం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన గురు, రాహువుల అరుదైన కలయిక ఈ సంవత్సరం 30 అక్టోబర్ 2023 న ముగుస్తుంది. మేషరాశిలో తన ప్రయాణాన్ని ముగించిన తర్వాత రాహువు మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ మార్పు మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులపై శుభ, అశుభ ప్రభావాలను చూపించనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30 తర్వాత మూడు రాశుల వారు లాభం పొందబోతున్నారు. ఈ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి
మేష రాశి వారికి గురు రాహు కలయిక ముగింపు సమయం శుభ సమయం. బృహస్పతి, రాహువు కలయిక ముగింపు ఈ రాశివారి జీవితంలో చాలా ఆనందాన్ని తెస్తుంది. వ్యాపారస్తులు అయితే వీరు తమ వ్యాపారం రంగంలో అభివృద్ధి చెందుతారు. సామాజిక కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. డబ్బు, గౌరవం, వృత్తిలో విజయం పొందుతారు. సంతానం లేని దంపతులు సంతానం పొందే అవకాశం ఉంది. దంపతులు ఆనందంగా జీవిస్తారు. యువకులకు వివాహానికి ఇది మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సంయోగం ముగింపు కూడా మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు విశేష విజయాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వారసత్వ సంపద విషయంలో ప్రయోజనం పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రానున్న కాలం చాలా శుభప్రదం. ఈ రాశి విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ఈ అరుదైన గ్రహాల కలయిక ముగింపుతో ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. సంపద, గౌరవం పెరుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి మద్దతు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)