Ganesh Utsav 2023: ఇంట్లో వాస్తు దోషమా.. తొలగిపోవడానికి గణపతి విగ్రహాన్ని ఏ దిశలో ప్రతిష్ఠించాలంటే..

ఎవరి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏదైనా అడ్డంకులు లేదా వాస్తు దోషం ఉన్నట్లయితే.. ఆ ఇంటిలోని వ్యక్తులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. అదృష్టం దురదృష్టంగా మారి చేపట్టిన పనుల్లో కూడా ఆటంకాలు కలుగుతాయి.  ఇంటి ముందు స్తంభం, పెద్ద చెట్టు, గొయ్యి మొదలైన వాస్తు దోషాలు కనుక ఉన్నట్లు అయితే.. ఈ వాస్తు దోషాలను తొలగించడానికి.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

Ganesh Utsav 2023: ఇంట్లో వాస్తు దోషమా.. తొలగిపోవడానికి గణపతి విగ్రహాన్ని ఏ దిశలో ప్రతిష్ఠించాలంటే..
Lord Ganesh Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2023 | 11:08 AM

హిందూ మతంలో గణపతి మొదటి పూజలను అందుకునే దైవం. చేపట్టిన పనిలో అడ్డంకులను తొలగించేవాడు అని నమ్మకం. కేవలం దర్భతో పూజించినా చాలు తన భక్తుల భక్తికి సంతోషించి కోరిన వరాలు ఇచ్చే బుజ్జి గణపయ్య. తనను పూజించిన వారి దుఃఖాలు, బాధలన్నింటినీ తొలగిస్తాడు. ఆనందం, శ్రేయస్సు , అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. హిందూ విశ్వాసం ప్రకారం గణేశుడు సిద్ధి, బుద్ది లతో కలిసి పూజలను అందుకుంటున్నాడు. గణపయ్య దయని పొందిన భక్తుల నోట ఎప్పుడూ లేమి అన్న మాట ఉండదు. గణపతిని మంగళమూర్తి అని కూడా అంటారు. శ్రీ గణేశుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి దోషం ఉండదని నమ్ముతారు. గణపతి అనుగ్రహం వల్ల ఆయుష్షు మాత్రమే కాదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

వాస్తు దోషాలను తొలగించే గణపతి

ఎవరి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏదైనా అడ్డంకులు లేదా వాస్తు దోషం ఉన్నట్లయితే.. ఆ ఇంటిలోని వ్యక్తులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. అదృష్టం దురదృష్టంగా మారి చేపట్టిన పనుల్లో కూడా ఆటంకాలు కలుగుతాయి.  ఇంటి ముందు స్తంభం, పెద్ద చెట్టు, గొయ్యి మొదలైన వాస్తు దోషాలు కనుక ఉన్నట్లు అయితే.. ఈ వాస్తు దోషాలను తొలగించడానికి.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

ఈ గణపతి విగ్రహం 11 అంగుళాలు కంటే పెద్దదిగా ఉండకూడదు. గణపతి విగ్రహాన్నివీపు కనిపించని విధంగా ఉంచండి. ఈ గణపతి విగ్రహం అన్ని అడ్డంకులను తొలగిస్తుందని.. దుఃఖాలు ఇంట్లోకి ప్రవేశించనివ్వదని నమ్ముతారు. హిందూ విశ్వాసం ప్రకారం గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఉంచాలనుకుంటే.. ఆ విగ్రహాన్ని  ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఉంచాలి. ఈ గణపతిని ఆరాధిస్తే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సుఖ శాంతులకు, సిరి సంపదులకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

ఆనందం, శ్రేయస్సును తెచ్చే గణేష్ యంత్రం

ఆదాయం తగ్గి  ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు.. ఏర్పడి మీ ఆనందంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తే.. మీ జీవితంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులను తొలగించి, సంతోషం, ఐశ్వర్యం, అదృష్టాన్ని కలిగించే విధంగా  గణపతి విగ్రహం వలె, మీరు గణేష యంత్రాన్ని కూడా ప్రతిష్టించండి. హిందూ విశ్వాసం ప్రకారం గణేశ యంత్రం ఉంచిన ఇంట్లో కలలో కూడా దుఃఖం కలగదు. ఆ ఇంట్లో దురదృష్టం ప్రవేశించదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)