AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2023: గణపతి బప్పాను ‘మోర్యా’ అని మొదట పిలిచింది ఎవరో తెలుసా.. అసలు కథ ఏంటో తెలుసుకో..

Bappa Morya Story: గణేష్‌ బప్పా.. మోరియా.. ఆదా లడ్డూ తేరా..!.. భక్తులు గణేశుడిని గణపతి, గజానన్, గణేశ, గజ్‌ముఖ్, బప్పా వంటి అనేక పేర్లతో పిలుస్తారు. పూజించేటప్పుడు గణపతిని బప్పా మోరియా అని కూడా పిలుస్తారు. గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. అయితే గణేష్ జీని బప్పా, మోర్యా అని ఎందుకు అంటారో తెలుసా.

Ganesh Chaturthi 2023: గణపతి బప్పాను 'మోర్యా' అని మొదట పిలిచింది ఎవరో తెలుసా.. అసలు కథ ఏంటో తెలుసుకో..
Ganpati Bappa Morya Story
Sanjay Kasula
|

Updated on: Sep 28, 2023 | 10:23 PM

Share

గణేశుడిని పూజించేటప్పుడు గణపతి బప్పా మోరియా అని చాలాసార్లు అంటూ ఉంటాం. అయితే బప్పా మోరియాకు గణేష్ జీ అనే పేరు ఎలా వచ్చిందో.. అతడిని తొలిసారిగా మోరియా అని ఎవరు పిలిచారో తెలుసా. గణేష్ జీ మోరియా పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. ఈ కథ 14వ శతాబ్దానికి చెందిన గణపతి భక్తుడు మోర్యా గోసావికి సంబంధించినది. గణేష్ చతుర్థి లేదా గణేషోత్సవం జరుపుకునే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.

గణేశోత్సవం మహారాష్ట్ర నుండి ఉద్భవించిందని.. దీనిని మొదట లోకమాన్య తిలక్ ప్రారంభించారని మీకు తెలియజేద్దాం. మహారాష్ట్ర తరువాత, ఈ పండుగ క్రమంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభమైంది. మహారాష్ట్రలో దీనిని పిటా బప్పా అంటారు. భక్తులు గణపతిని తమ తండ్రిగా భావించి బప్పా అని పిలిచి పూజించడం ప్రారంభించారు. ఈ విధంగా గణేశుడిని ‘గణపతి బప్పా’ అని పిలవాలి. కానీ గణపతి బప్పా ‘మోర్యా’ అని పిలవబడే కథ చాలా ఆసక్తికరంగా ఉంది.

“మోరియా” అంటే ఏంటి.?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం..

మోరియా అసలు కథ..

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట.. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది..

ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా.. అని మరాఠీ లో నినదిస్తాం.. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం