AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు కేజీల బంగారం, 64 కేజీల వెండి, రూ.5 కోట్లకు పైగా నగదు… లాల్‌బాగ్చా గణేశుడికి కళ్లు చెదిరేలా కానుకలు..

ఇకపోతే, ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గ‌ణేష్‌కు దేశంలోనే ప్ర‌త్యేక స్థానం ఉంది. గత 93 ఏళ్లుగా ద‌క్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గ‌ణేషుడి ఉత్స‌వాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. లాల్‌బాగ్చా రాజాను ప్ర‌తి ఏటా ల‌క్ష‌ల మంది భ‌క్తులు సంద‌ర్శిస్తారు. వీళ్ల‌లో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వ‌స్తాయి.

మూడు కేజీల బంగారం, 64 కేజీల వెండి, రూ.5 కోట్లకు పైగా నగదు... లాల్‌బాగ్చా గణేశుడికి కళ్లు చెదిరేలా కానుకలు..
Lalbagh Cha Raja
Jyothi Gadda
|

Updated on: Oct 02, 2023 | 7:09 AM

Share

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గణేశుడికి భక్తులు హృదయపూర్వకంగా కానుకలు సమర్పించారు. కానుకగా నగదు, బంగారు ఆభరణాలు సమర్పించుకున్నారు. ముంబైలోని లాల్‌బౌగ్చా రాజా గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా విరాళంగా వచ్చిన కానుకలను వేలం వేస్తున్నారని, విరాళాలు, వేలం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తామని లాల్‌బాగ్ సంస్థ కార్యదర్శి సుధీర్ దాల్వి తెలిపారు. ఈ ఏడాది వినాయకుడికి సమర్పించిన కానుకల్లో మొత్తం మూడున్నర కిలోల బంగారం ఉందని, దీని విలువ సుమారు రూ.2.10 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో పాటు 45 లక్షల విలువైన 64 కిలోల వెండిని కూడా భక్తులు సమర్పించారు. బంగారం, వెండి ఆభరణాల మొత్తం విలువ దాదాపు రూ.2.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

విరాళంగా ఇచ్చిన నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రోజుల కౌంటింగ్‌లో రూ. 5 కోట్ల 16 లక్షలు లెక్కించినట్లు సుధీర్ దల్వీ తెలిపారు. కౌంటింగ్ పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు, మొత్తం నగదు రూ. 8 కోట్లు దాటే అవకాశం ఉంది. కొంతమంది భక్తులు బప్పాకు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కానుకగా సమర్పించారు. దీని ధర దాదాపు రూ.3.5 లక్షలు ఉంటుందని సమాచారం.

ఇకపోతే, ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గ‌ణేష్‌కు దేశంలోనే ప్ర‌త్యేక స్థానం ఉంది. గత 93 ఏళ్లుగా ద‌క్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గ‌ణేషుడి ఉత్స‌వాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. లాల్‌బాగ్చా రాజాను ప్ర‌తి ఏటా ల‌క్ష‌ల మంది భ‌క్తులు సంద‌ర్శిస్తారు. వీళ్ల‌లో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వ‌స్తాయి.

ఇవి కూడా చదవండి

గణేశ్‌ నవరాత్రులు అత్యంత ప్రసిద్ధ పండుగ. పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంబయితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వివిధ మండలాలు ఏర్పాటు చేసిన పండల్స్ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. వినాయక మండపాల ప్రత్యేకతను చూసేందుకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ముంబయి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..