Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానం గాల్లో ఉండగా 6నెలల చిన్నారికి ఆగిన ఊపిరి..! దేవదూతలుగా వచ్చి ప్రాణం పోసిన ఇద్దరు వైద్యులు..

ఓ దంపతులు తమ బిడ్డను వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నారు. పుట్టినప్పటి నుంచి చిన్నారి గుండె జబ్బుతో బాధపడుతోంది. ఇంతలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అతని పరిస్థితి చూసి తల్లి తల్లడిల్లిపోయింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో విమానం టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల తర్వాత,

విమానం గాల్లో ఉండగా 6నెలల చిన్నారికి ఆగిన ఊపిరి..!  దేవదూతలుగా వచ్చి ప్రాణం పోసిన ఇద్దరు వైద్యులు..
Indigo Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 02, 2023 | 8:13 AM

విమానం గాల్లో ఉండగా ఆరు నెలల చిన్నారి ఆరోగ్యం విషమించింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పసికందును కాపాడేందుకు ఇద్దరు వైద్యులు దేవదూతలుగా వచ్చారు. శనివారం రాంచీ-ఢిల్లీ ఇండిగో విమానంలో ఇద్దరు వైద్యులు 6 నెలల చిన్నారికి దేవదూతలుగా వచ్చి ప్రాణం పోశారు. ఓ దంపతులు తమ బిడ్డను వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నారు. పుట్టినప్పటి నుంచి చిన్నారి గుండె జబ్బుతో బాధపడుతోంది. ఇంతలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అతని పరిస్థితి చూసి తల్లి తల్లడిల్లిపోయింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో విమానం టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల తర్వాత, సిబ్బంది ఒక ప్రకటన చేశారు.. చిన్నారికి సహాయం కోసం అభ్యర్థించారు.

అయితే, ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, రాంచీకి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నితిన్ కులకర్ణి, డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్ కూడా ఈ విమానంలోనే ప్రయాణించారు. కులకర్ణి ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతనికి వైద్య అనుభవం కూడా ఉంది.

డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్ సదర్ హాస్పిటల్, రాంచీలో ఉన్నారు. చిన్నారి తల్లి ఏడుస్తుండటం గమనించిన డాక్టర్ కులకర్ణి, డాక్టర్ మొజమిల్ స్పందించారు. వెంటనే చిన్నారికి వైద్యం అందించారు. సంబంధిత ఇంజక్షన్ ఇచ్చి చిన్నారికి ప్రాణవాయువు అందించారు. పిల్లవాడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇంజెక్షన్, ఆక్సిజన్ తీసుకున్న తర్వాత చిన్నారి పరిస్థితిలో కొంత ఊరట కనిపించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిలో మొదటి 15-20 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. ఒత్తిడితో కూడుకున్నవని డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే ఇంజెక్షన్లు, ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత అతని పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. చివరికి అతని పరిస్థితి సాధారణమైంది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది కూడా చాలా సహాయపడ్డారు. వారు వెంటనే సహాయం చేసారని అన్నారు.

విమానం ల్యాండింగ్ అయిన వెంటనే చికిత్స కోసం పరిగెత్తారు తల్లిదండ్రులు. ఉదయం 9.25 గంటలకు విమానం ల్యాండ్ కాగా, చిన్నారికి ఆక్సిజన్ సపోర్టు చేసేందుకు వైద్య బృందం అక్కడికి చేరుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న వారు కూడా డాక్టర్లిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. వైద్యులు దేవుడు పంపిన దేవదూతలుగా కొనియాడారు. ఫ్లైట్‌లో 6 నెలల పాప కొత్త జీవితాన్ని పొందడం చూశామంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..